/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/earthquake-4.webp)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. అర్థరాత్రి నుంచి మూడు సార్లు కంపించిన భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.4 గా భూకంప తీవ్రత నమోదైంది. ఉత్తర సుమత్రా దీవుల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
🔔#Earthquake (#gempa) M5.2 occurred 20 km E of Banda Aceh (#Indonesia) 11 min ago (local time 09:58:35). More info at:
— EMSC (@LastQuake) March 30, 2025
📱https://t.co/QMSpuj6Z2H
🌐https://t.co/Y9fMbi6m66
🖥https://t.co/kGF98asWfx pic.twitter.com/uUI7xov9eu
ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో..
ఇదిలా ఉండగా ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఙన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా మయన్మార్‌లో భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది. దీని ప్రభావానికి చాలా ఇళ్లు కూలిపోయాయని.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాల ముందుకొస్తున్నాయి.ఇప్పటికే భారత్.. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, టెంట్లు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా సాయం చేస్తామని ప్రకటించాయి. అలాగే మయన్మార్, థాయ్‌లాండ్‌కు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియోగుటెరస్ తెలిపారు.