Dubai: దుబాయ్‌కు కష్టాలు.. వలస వెళ్లిపోతున్న మిలియనీర్లు

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్‌కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు.

New Update
Dubai's Wealthy Pay Hefty Sums To Flee Amid Middle East War

Dubai's Wealthy Pay Hefty Sums To Flee Amid Middle East War

మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్‌కు కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నట్లు ఫైనాన్సియల్ టైమ్స్ దీనికి సంబంంధించిన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. యుద్ధ భయంతో సంపన్నులు దుబాయ్‌ను వీడి ఒమన్ రాజధాని మస్కట్‌ మీదుగా లండన్, యూరప్‌ నగరాలకు వెళ్లిపోతున్నారు.  ప్రతిరోజూ మస్కట్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 30 ప్రైవేటు జెట్లు, చార్టర్ విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఒక్కో విమానంలో కనీసం 8 మంది వెళ్తున్నారు. 

ఇరాన్ దాడులు ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దాదాపు 1000 మంది మిలియనీర్ల కుటుంబాలు దుబాయ్‌ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో 81,200 మంది మిలియనీర్లు ఉంటున్నారు. యుద్ధం వల్ల భారీగా వలసలు కొనసాగుతుండటంతో దుబాయ్‌పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మస్కట్‌ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగిపోయింది. గతవారంలో అక్కడి నుంచి వెళ్లిన విమానాల్లో మూడో వంతు ప్రైవేట్‌ జెట్‌లే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

Also Read: దేశంలో LPG కొరత.. కేంద్రం సంచలన ప్రకటన

ఒక్కో సీటు ధర రూ.16 లక్షలు

సంపన్నుల కోసం ప్రైవేట్‌ జెట్‌లలో ఒక్కో సీటు ధర 20000 డాలర్లు(రూ.16 లక్షలు)గా ఉంది. అయినప్పటికీ చాలా ధనిక కుటుంబాలు ఐరోపాకు వెళ్లిపోతున్నారు. మస్కట్‌లో రద్దీ పెరగడంతో కొందరు రియాద్, దమ్మామ్‌ ఎయిర్‌పోర్టులను కూడా వాడుకుంటున్నారు. మరికొందరు ఆసియా నుంచి అమెరికా మీదుగా యూరప్‌కు వెళ్తున్నారు. ఎయిర్‌ ఇండియా కూడా లండన్, పారిస్, న్యూయార్క్‌ లాంటి నగరాలకు అదనపు విమానాలు ప్రకటించింది. 

ప్రపంచంలో అతిపెద్ద మిలియనీర్ల వలసలకు దుబాయ్‌ కేరాఫ్‌గా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నుంచి వలసలు మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ అరేబియా నుంచి కూడా మిలియనీర్లు వెళ్లిపోతున్నారు. అక్కడ ఉండే అత్యధిక సంపన్నుల వద్ద కనీసం 10 లక్షల మిలియన్ డాలర్ల సంపద ఉంటుంది. వీళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందుకే సంపన్నులను ఆకర్షించడం కోసం చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. 

Also Read: గ్యాస్ సిలిండర్ల దెబ్బ..ఆన్‌లైన్లో ఇండక్షన్ స్టవ్లు ఔట్ ఆఫ్ స్టాక్!

గల్ఫ్ దేశాల్లోని యూఏఈకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ వలసలను స్వాగతించే విధానం, జీరో ఆదాయపు పన్ను, ప్రంపచ స్థాయి మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం ఉంటాయి. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలో ఎక్కువగా బిలియనీర్లు ఉండేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల సంపన్నులు వలస వెళ్లిపోవడంతో ఆ ప్రావిన్స్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  

Advertisment
తాజా కథనాలు