/rtv/media/media_files/2025/01/16/VflNidJIrkjwtCfo92QK.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్ అతలాకుతలం అయిపోతుంది. కేవలం అమెరికా మార్కెట్లు మాత్రమే కాకుండా ఇండియా, చైనా, జపాన్ మార్కెట్లు కూడా భారీగా నష్టాల బాట పట్టాయి. అయితే ఈ విషయంపై ఇదే అంశంపై ఆదివారం విలేకర్లు ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ చాలా లైట్ తీసుకున్నారు.
TRUMP JUST NOW:
— amit (@amitisinvesting) April 7, 2025
"We have to solve our trade deficit, unless we solve that problem, I'm not going to make a deal."
continuing to double down on the tariffs pic.twitter.com/aSQROGPK1b
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
ఔషధం కొన్ని సమస్యలకు అవసరమని..
కొన్ని సమస్యలకు ఔషధం అవసరం అని తెలిపారు. దీంతో పాటు వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ సమర్థించారు. అసలు సుంకాలను తగ్గించే ప్రసక్తి లేదని బల్ల గుద్ది చెప్పారు. ప్రపంచ మార్కెట్లు పతనమవ్వాలని సుంకాలు విధించలేదని, ఇవి పతనం కావాలని కోరుకోలేదన్నారు.
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
ఈ టారిఫ్‌లపై అసలు టెన్షన్ తీసుకోవద్దని, కొన్నిసార్లు సమస్యను పరిష్కరించుకోవడానికి మెడిసిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఐరోపా, ఆసియా దేశాధినేతలతో చర్చించారని, ఇప్పుడు వాళ్లంతా ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆరాటపడుతున్నారని తెలిపారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోకి బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లు ప్రకటించినప్పటి నుంచి కేవలం దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా .. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాట పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుందని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. జపాన్ నిక్కీ 8 శాతం వరకు పతనమైంది. ఇదే కాకుండా గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల వల్ల మూడు రోజుల్లో రూ.3 వేలకు పైగా బంగారం ధరలు భారీగా తగ్గాయి.
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి