/rtv/media/media_files/2025/03/15/YmyhU7FcMTyZSNHNcJq0.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్‌ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్ ఆ రిపోర్టర్ వైపు సీరియస్‌గా చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🇺🇸 Jornalista acerta rosto de Trump com microfone
— RT Brasil (@rtnoticias_br) March 15, 2025
💬 "Como um repórter conseguiu colocar o microfone tão perto do rosto de Trump? Isso simplesmente não parece certo. A segurança deveria ser reforçada", escreveu a republicana Laura Loomer. pic.twitter.com/ktTbP6dDeQ
Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే
ఇక వివరాల్లోకి వెళ్తే.. జాయిండ్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్టులో గాజా పరిస్థితులపై జర్నలిస్టులు ట్రంప్‌ను ప్రశ్నలు అడగగా ఆయన బదులిస్తున్నారు. ఓ రిపోర్టర్ ప్రశ్న అడుగుతుండగా.. మరో రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ట్రంప్ ముఖానికి ప్రమాదవశాత్తు తగిలింది. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. కనుబొమ్మలతో ఆ రిపోర్టర్‌ను హెచ్చరించినట్లుగా చూశారు. ఆ తర్వాత రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానాలిచ్చారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు