US-Iran war: ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపననున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది.

New Update
Crude oil prices spike amid US-Iran war

Crude oil prices spike amid US-Iran war

ఇరాన్‌పై అమెరికా(iran america war), ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపననున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేసినట్లు సమాచారం. ఇక్కడ రవాణాకు ఆటంకం ఏర్పడితే ఇంధన, సరకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

హార్ముజ్ జలసంధి ఇరాన్‌ను ఒమన్, UAEల నుంచి వేరు చేస్తుంది. ఇక్కడి నుంచే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం జరుగుతుంది. కేప్లర్‌ రిపోర్ట్‌ ప్రకారం 2025 చివరి నాటికి 40 శాతంగా ఉన్న భారత చమురు దిగుమతులు 2026 జనవరి-ఫిబ్రవరి నాటికి 50 శాతం పెరిగాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించి, మిడిల్ ఈస్ట్‌ దేశాలపై ఆధారపడటం పెరిగింది. భారత్‌ ప్రతిరోజూ 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును సౌదీ అరేబియా, UAE, ఇరాక్, కువైట్ నుంచి ఈ హర్మూజ్ జలసంధి మార్గం నుంచే దిగుమతి చేసుకుంటోంది. అలాగే రోజుకు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను సైతం భారత్ ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 

Also read: రణరంగమైన కరాచీ...ఘర్షణల్లో 9 మంది మృతి

Crude Oil Prices Spike Amid US-Iran War

ఇప్పటికే అమెరికా బలగాల మోహరింపు వల్ల ముడి చమురు ధరలు సుమారు 10 శాతం పెరిగిపోయాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ రిపోర్టు ప్రకారం.. ఒకవేళ  రోజుకు 33 లక్షల బ్యారెళ్ల ఇరాన్‌ చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ధర 9-15 శాతం పెరిగి.. 76-81 డాలర్లకు చేరుకునే ఛాన్స్ ఉంది. హార్మూజ్ జలసంధికి పాక్షికంగా ఆటంకం కలిగితే 20-40 శాతం పెరిగి 95-110 డాలర్లకు చెరుకునే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది.     

Also Read: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి..  వెల్లువెత్తిన నిరసనలు

భారత్‌ వినియోగించే 85 శాతం చమురు ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తోంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా కూడా దేశం చెల్లించాల్సిన దిగుమతి బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ యుద్ధ వాతావరణంలో ముడి చమురు బ్యారెల్ ధర ఒకవేళ 90 డాలర్లు దాటితే మనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి రావడంతో రూపాయిపై ఒత్తిడి పడుతుంది. తద్వార రూపాయి విలువ మరింత పడిపోతుంది.  అలాగే భారత్‌ నుంచి ఇరాన్‌కు ఎగుమతయ్యే ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలు, బాస్మతీ బియ్యం తదితర వస్తువులపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. 

Advertisment
తాజా కథనాలు