/rtv/media/media_files/2025/04/11/YTGo3QqVl266Cve1MpqM.jpg)
Trump and Jinping
అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ రోజురోజుకి ముదురుతోంది. ట్రంప్ టారిఫ్‌లపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ట్రంప్ సర్కార్ చైనా మినహా ప్రపంచంలో అన్ని దేశాలపై తన టారిఫ్‌లను 90 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా--చైనా టారిఫ్‌లను పెంచుకుంటూనే పోతున్నాయి.
ప్రస్తుతం ట్రంప్.. చైనాపై విధిస్తున్న సుంకాలను 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. అమెరికా తమపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ యూరోపియన్ యూనియన్ సహకారం కోరుతున్నారు.
Also Read: ఇదొక విచిత్రమైన లవ్ స్టోరీ.. ఫ్యాన్ రిపేర్ కోసం వచ్చి పాపను పడేశాడు!
అధిక సుంకాల వల్ల చైనాలోకి అమెరికా ఉత్పత్తులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందని చైనా ఆర్థికమంత్రి తెలిపారు. ఇరు దేశాలు ఇలా సుంకాలు పెంచడంతో వీటి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిణామాలకు అమెరికాదే బాధ్యత అని చైనా అంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా భయాన్ని సృష్టిస్తోందని ఆరోపిస్తోంది.
చైనా ఒత్తిడి వల్లే అమెరికా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలపై తాత్కాలికంగా సుంకాల అమలును 3 నెలల పాటు నిలిపివేసినట్లు చెప్పింది. సుంకాలతో ఇలా ట్రేడ్‌వార్ చేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదని జిన్‌పింగ్ చెబుతున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా, చైనాతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్‌హువా తెలిపింది.
Also Read: స్కూల్ బ్యాగ్‌లో కండోమ్స్, తంబాకు ప్యాకెట్లు, కత్తులు, అగ్గిపెట్టలు.. ఎవర్రా మీరంతా!
అధిక టారిఫ్‌ల వల్ల చైనాలో లక్షలాది పరిశ్రమయ యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు తక్కువ రేట్లకే ఆఫర్లు ఇస్తున్నారు. ట్రంప్‌ను రెచ్చగొట్టడం కంటే ఒప్పందం కుదుర్చుకోవడం ముఖ్యమని చైనాకు నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఈ ట్రేడ్‌వార్ అనేది ఎప్పుడు ముగుస్తుందో అనేదానిపై క్లారిచీ లేదు.
trump | jinping | trump tariffs | rtv-news