ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి వైపే చూస్తున్నాయి. ఈ కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు పుడుతున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ మిత్రదేశమైన చైనా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
హార్మూజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలమార్గం కాదని, అది తమ దేశానికే చెందిన సముద్ర ప్రాంతమని ఇరాన్ కొత్త వాదన మొదలుపెట్టింది. అక్కడ నౌకలు వెళ్లాలంటే తమ పర్మిషన్ ఉండాలని, టోల్ ఫీజు కూడా కట్టాలని ఇరాన్ పట్టుబడుతోంది. కానీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దీనిపై స్పందిస్తూ ఇరాన్‌కు గట్టి షాక్ ఇచ్చారు. హార్మూజ్ అనేది అందరి ప్రయోజనాల కోసం ఉండే అంతర్జాతీయ జలమార్గం.. దాన్ని వెంటనే తెరిచి నౌకల రాకపోకలకు అనుమతించాలని ఆయన ఇరాన్‌కు సూచించారు.
చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది?
ఇరాన్‌కు మద్దతు ఇచ్చే చైనా, ఇప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రధాన కారణం ఆర్థిక నష్టాలు అని తెలుస్తోంది. చైనాకు అందే క్రూడ్ ఆయిల్‌లో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుండే వస్తుంది. హార్మూజ్ మూతపడటంతో ఆ సరఫరా ఆగిపోయింది. ఇంధనం రాకపోవడంతో చైనాలో పరిశ్రమలు, రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. దీనివల్ల చైనా ఆర్థిక వృద్ధి 1% వరకు తగ్గే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలతో చైనా చేసే వ్యాపారం దాదాపు 50% పడిపోయింది. దీనివల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది. మరోవైపు అమెరికా పెట్టిన ఆంక్షలను లెక్కచేయకుండా చైనా నుండి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరుకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరిపింది. ఈ ఘటనపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా ఉండాలని, కాల్పులు ఆపేసి శాంతిని పునరుద్ధరించాలని చైనా కోరింది.
చైనా వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి?
హార్మూజ్ మార్గం నమ్మదగ్గది కాదని గ్రహించిన చైనా, ఇతర మార్గాల ద్వారా శక్తి అవసరాలను తీర్చుకోవాలని చూస్తోంది:
రష్యా పైప్‌లైన్‌లు: సైబీరియా నుండి నేరుగా ఆయిల్, గ్యాస్ తెప్పించుకోవడం.
ఆర్కిటిక్ రూట్: రష్యా మీదుగా సముద్ర మార్గంలో చమురు సరఫరాను పెంచడం.
నిల్వలు: అత్యవసర పరిస్థితుల కోసం చైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ స్టాక్ ఉంది.
సోలార్ & విండ్: చమురుపై ఆధారపడకుండా సోలార్, విండ్ పవర్‌పై భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఇరాన్ తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంటే, తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం మిత్రదేశమని కూడా చూడకుండా చైనా గట్టిగానే క్లాస్ పీకింది. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుందన్నది ఉత్కంఠగా మారింది.
china : ఇరాన్‌కు చైనా భారీ షాక్ .. హార్మూజ్ మీ సొత్తు కాదు.. వెంటనే తెరవండి!
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి వైపే చూస్తున్నాయి. ఈ కీలకమైన సముద్ర మార్గం మూతపడటంతో చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగలు పుడుతున్నాయి.