/rtv/media/media_files/2026/04/05/chinas-ai-2026-04-05-16-24-22.jpg)
పశ్చిమాసియా యుద్ధంలో క్షిపణులు, డ్రోన్ల గర్జనల కంటే నిశ్శబ్దంగా సాగుతున్న 'డిజిటల్ వార్' ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో చైనా(China Spy Ship) తన ప్రైవేట్ టెక్ కంపెనీల ద్వారా ఇరాన్(iran america war) కు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా సైనిక కదలికలను కనిపెట్టడానికి చైనా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ సోర్స్ డేటాను ఆయుధాలుగా వాడుతున్నాయి. సాధారణంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే శాటిలైట్ ఫొటోలు, ఫ్లైట్ ట్రాకర్లు, షిప్పింగ్ డేటాను ఏఐ విశ్లేషించి, అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తోంది. అమెరికా యుద్ధ విమానాలు ఎక్కడ ఉన్నాయి? విమానవాహక నౌకలు ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి? సైనిక స్థావరాల్లో ఆయుధ నిల్వలు ఎంత ఉన్నాయి?
వంటి అత్యంత రహస్య సమాచారం చైనా గుప్పిట్లోకి వెళ్తోంది.
బహిరంగంగా శాంతి గురించి మాట్లాడే చైనా, తన ప్రైవేట్ జియోస్పేషియల్ కంపెనీలను రంగంలోకి దించింది. ఈ సంస్థలు రూపొందించిన నిఘా టూల్స్ సహాయంతో ఎవరైనా, ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించే వీలుంది. ఈ సమాచారాన్ని చైనా తన సైనిక ఉన్నతాధికారులకు చేరవేయడమే కాకుండా, పరోక్షంగా ఇరాన్‌కు కూడా మేలు చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : భర్తను చంపి తగులబెట్టిన భార్య.. గుట్టురట్టు చేసిన క్యూఆర్ కోడ్!
ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు
ఒకప్పుడు కేవలం శక్తివంతమైన ప్రభుత్వాలకు మాత్రమే పరిమితమైన నిఘా వ్యవస్థ, ఇప్పుడు ఏఐ పుణ్యమా అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వచ్చింది. చైనా ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న ఈ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం భవిష్యత్తులో కేవలం అమెరికాకే కాకుండా, ప్రపంచ దేశాల భద్రతకు పెను సవాలుగా మారనుంది.
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి యుద్ధ గమనాన్ని మార్చడానికి చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ అదృశ్య యుద్ధాన్ని అమెరికా ఎలా ఎదుర్కోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : విజయ్ అఫిడవిట్‌లో తప్పులు.. ఆస్తులు, వయస్సు, కేసులు అన్ని తప్పే!
Follow Us