China: అరుణాచల్‌ప్రదేశ్‌ పేరు మార్చిన చైనా.. భూభాగం మాదే అంటూ బలుపు మాటలు

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరుపారేసుకుంది. ఈ ప్రాంతానికి జాంగ్‌నాన్ అనే పేరును ప్రకటించింది. ఇది తమ దేశంలోనే భూభాగమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మంగళవారం తెలిపారు.

New Update
China calls naming of places in Zangnan sovereign matter

China calls naming of places in Zangnan sovereign matter

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరుపారేసుకుంది. ఈ ప్రాంతానికి జాంగ్‌నాన్ అనే పేరును ప్రకటించింది. ఇది తమ దేశంలోనే భూభాగమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మంగళవారం తెలిపారు. భారత్‌ అక్రమంగా ఏర్పాటు చేసిన అరణాచల్‌ప్రదేశ్‌ను తాము ఎప్పుడూ గుర్తించలేదని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారంలో భాగంగానే ఆ ప్రాంతంలో కొన్ని పేర్లను ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చారు.  చైనా తీరుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత్‌కు చెందిన ప్రాంతాలను చైనా ఇష్టం వచ్చినట్లు ఊహజనిత పేర్లు పెట్టడాన్ని ఖండించింది.   

విదేశీ వ్యహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్వాల్ దీనిపై స్పందించారు. ఎన్ని పేర్లు మార్చినా, ఎన్ని వాదనలు చేసినా కూడా అరుణాచల్‌ప్రదేశ్‌ ఎప్పటికీ కూడా భారత్‌లోని భూభాగమని తేల్చిచెప్పారు. వాస్తవాలను ఎవరూ ఎప్పటికి మార్చలేరని స్పష్టం చేశారు. చైనా చేస్తున్న ఇలాంటి అసంబద్ధ ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగిస్తాయంటూ హెచ్చరించారు. 

ఓవైపు సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాలని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చాలని చెబుతూనే మరోవైపు చైనా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడటం అంతర్జాతీయంగా చర్చనీయమవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో దాదాపు 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడం గమనార్హం. భౌగోళిక, చారిత్రక ఆధారాలతో ఆ ప్రాంతం తమదేనని భారత్‌ గట్టిగా వాదిస్తున్నా చైనా మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ప్రతిసారి ఇలా అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. 

ప్రస్తుతం చూసుకుంటే భారత్-చైనా సంబంధాలు స్థిరంగా ఉన్నాయి. చైనా-భారత్‌ సంబంధాలు మెరుగుపర్చేందుకు, అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్న చైనా విధానంలో ఎలాంటి మార్పు లేదని గువో జియాకున్ తెలిపారు. ఇరు దేశాలు ఒకరినొకరు సహకరించుకుంటూ, ద్వైపాక్షిక సంబంధాలకు మేలు జరిగేలా చేస్తాయని ఆశిస్తున్నామని గువో పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు