/rtv/media/media_files/2025/03/30/INPyndRsccEAB7uQ7xoP.jpg)
ChatGPT chief Sam Altman appeal as Studio Ghibli breaks internet, Says ‘Can yall please chill’
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. తాజాగా జిబ్లీ ఫొటోల ట్రెండ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ ఇలా ఎక్కడ చూసినా జిబ్లీ ఫొటోలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవలే తమ చాట్‌జీపీటీలో ఈ జీబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. మనం ఏదైనా ఒక ఫొటోను అటాచ్ చేసి జిబ్లీ స్టైల్‌లో మార్చాలని ప్రోంప్ట్ ఇస్తే కార్డున్ రూపంలో చిత్రాలు వచ్చేస్తున్నాయి.
Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...
ప్రపంచవ్యాప్తంగా చాలామంది వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. చాట్‌జీపీటీతో పాటు ఎక్స్‌లో కూడా ఈ జిబ్లీ ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. అయితే చాలామంది ఈ సదుపాయన్ని విపరీతంగా వాడటంతో ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. జీబ్లీ వినియోగం ఎక్కవగా ఉందని.. యూజర్లు కాస్త కూల్‌గా ఉంటే బాగుంటుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ రాసుకొచ్చారు.
can yall please chill on generating images this is insane our team needs sleep
— Sam Altman (@sama) March 30, 2025
ఇదిలాఉండగా.. చాట్‌జీపీటో ఈ జీబ్లీ స్టైల్ ఇమేజ్ ఆప్షన్ తీసుకురావడంతో నెటిజన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల తమ జూపీయూ సిస్టమ్‌పై అధిక భారం పడుతోందని.. అందుకే దీనిపై లిమిట్ పెడుతున్నామని శామ్ ఆల్ట్‌మన్ ఇటీవలే చెప్పారు. ప్రస్తుతం యూజర్లకు ఫ్రీగా రోజుకు మూడు ఫొటోలు జనరేట్ చేసుకునేలా లిమిట్ విధించారు. ప్రీమియమ్ తీసుకున్న యూజర్లకు ఈ లిమిట్ ఏమీ ఉండదు.
Also Read: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్
Also Read: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
Ghibli image | Ghibli trend | chat-gpt | sam