సీజ్‌ఫైర్ ఒప్పందం.. ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు ఇవే

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. సీజ్‌ఫైర్‌ కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

New Update
Ceasefire Deal, Iran’s Demands and US Proposals Revealed

Ceasefire Deal, Iran’s Demands and US Proposals Revealed

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్.. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్రంప్ తాజాగా సంచలన పోస్టు చేశారు. యుద్ధం ముగించే అంశంలో పూర్తిస్థాయి ఒప్పందం అమల్లోకి వచ్చేవరకు మా యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు ఇరాన్‌, దాని పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉంటాయని పేర్కొన్నారు. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటిగా వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇంతకీ కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇరాన్ 10 డిమాండ్లు చేయగా, అమెరికా 15 ప్రతిపాదనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇరాన్ డిమాండ్స్ 

1. ఇరువైపులా దాడులు చేసుకోకుండా కచ్చితమైన హామీ ఉండాలి. ఇరాన్‌ అణుశుద్ధికి ఒప్పుకోవాలి.
2. హార్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు జరగాలి.
3. లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులతో పాటు అన్ని చోట్లా యుద్ధం పూర్తిగా ఆపివేయాలి.
4. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు, మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలి.
5. ఇరాన్‌కు వ్యతిరేకంగా UNO భద్రతా మండలి, ఇతర సంస్థల్లో చేసిన అన్ని తీర్మానాలను రద్దు చేయాలి.
6. హార్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్‌ ప్రొటోకాల్‌ ఏర్పాటు చేయాలి. దీనికోసం పరస్పర అంగీకారంతో రూల్స్ రూపొందించాలి.
7. ఇరాన్‌కు ఇప్పటిదాకా జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి. 
8. ఇరాన్‌పై ఉన్న అన్ని ప్రాథమిక, అనుబంధ ఆంక్షలు తొలగించాలి. 
9. విదేశాల్లో సీజ్‌ చేసిన అన్ని ఇరాన్‌ ఆస్తులు, నిధులను వెంటనే విడుదల చేయాలి. 
10. పైన షరతులన్నీ అంతర్జాతీయ చట్టాల కింద తప్పనిసరిగా అనుసరించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేయాలి. 

Also Read: దెబ్బ మీద దెబ్బ.. IT ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇక ఆ ఫెసిలిటీ బంద్!

ట్రంప్‌ 14 ప్రతిపాదనలు

1. విస్తృత స్థాయిలో చర్చలకు వీలుగా నెల రోజులపాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఉండాలి
2.ఇరాన్‌ న్యూక్లియర్‌ ఎపిసోడ్ శాశ్వతంగా వదిలేయాలి.
3. అణుశుద్ధిని పూర్తిగా నిలిపివేయాలి.
4.ఇప్పటికే శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEIకు అప్పగించాలి.
5.ఇరాన్‌లోని నతాంజ్‌, ఇస్ఫహాన్‌, ఫోర్డో అణుకేంద్రాలను IAEI ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయాలి.
6.హార్ముజ్‌ జలసంధిని 24/7 తెరిచి ఉంచాలి.
7.పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో ప్రాంతీయ మిలీషియా కార్యకలాపాలు ఆపేవేయాలి.
8.వివిధ మిలిటెంట్‌ గ్రూపులకు ఇరాన్ సపోర్ట్ ఇవ్వకూడదు.
9.బాలిస్టిక్‌ క్షిపణులు సంఖ్య, సామర్థ్యంపై నియంత్రణ ఉండాలి.
10.కేవలం స్వీయ రక్షణకే క్షిపణులను వినియోగించాలి.
11.ఈ షరతులకు ఇరాన్‌ అంగీకరిస్తేనే.. ఆ దేశ డిమాండ్స్‌కు ఒప్పుకుంటానంటున్న ట్రంప్
12.ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షల ఎత్తివేయడం
13.ఇరాన్‌లో బుషెహర్‌ అణువిద్యుత్‌ ప్లాంటు సహా ఆ దేశ పౌర అణు కార్యక్రమానికి కూడా టెక్నాలజీ సాయం అందించడం
14. ఒప్పందంలో ఇరాన్‌ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే.. ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి గతంలో విధించిన ఆంక్షలు మళ్లీ వర్తిస్తాయి. 

Also Read: మారణహోమం నుంచి మాతృభూమి దాకా.. ఇజ్రాయెల్ ఆవిర్భావ చరిత్ర ఇదే !

అయితే ఈ అమెరికా ప్రతిపాదనల్లో యురేనియం అణుశుద్ధని నిలిపివేయాలనడం ఇరాన్‌కు నచ్చడం లేదు. అలాగే మిలిటెంట్ గ్రూప్‌లకు సపోర్ట్ చేయకూడదని చెప్పడం కూడా ఇరాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇరాన్ డిమాండ్స్ సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ పైకి చెబుతున్నారు. కానీ ఆయన లోలోపల వ్యతిరేకంగానే ఉన్నారు. హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకే ట్రంప్ ఈ డ్రామాలు ఆడుతున్నట్లు ఇరాన్ అంటోంది. అయితే ఏప్రిల్‌ 10న పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందులో ఏమైనా తేడాలు వస్తే వెంటనే మళ్లీ ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు