/rtv/media/media_files/2025/03/23/gTTP3UpzSk1FOl7xKX52.jpg)
Canada PM Mark Carney
కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవలే కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటికొచ్చింది. ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 28న ఫెడరల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కెనడా పార్లమెంటులో మొత్తం 338 స్థానాలున్నాయి. వీటికి ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించనున్న మార్క్ కార్నీ ఆదివారం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో దారుణ హత్య.. వేటాడి వెంటాడి గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
ప్రధాని మార్క్ కార్నీ కెనడా రాజధాని ఒట్టావా నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని లిబరల్ పార్టీ శనివారం తెలిపింది. అయితే కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత గ్లోబల్ న్యూస్ ఓ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో ఓటర్లు అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. 42 శాతం మంది ఓటర్లు లిబరల్ పార్టీకి సపోర్ట్ చేయగా.. 36 శాతం మంది కన్జర్వేటర్లకు మద్దతిచ్చారు. 48 శాతం మంది మార్క్ కార్నీ నాయకత్వానికి అనుకూలంగా ఉంటే 30 శాతం మంది వ్యతిరేకిస్తు్న్నట్లు సర్వేలో తేలింది.
Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
మరోవైపు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై ఈ ఏడాది మార్చి 4 నుంచి 25 శాతం సుంకం వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ అక్రమ రవాణా, వలసలను దేశ సరిహద్దుల్లోనే అరికట్టాలని ట్రంప్ కెనడాకు చెప్పారు. ఒకవేళ ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడాను చేర్చాలంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో కెనడాలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్