/rtv/media/media_files/2025/04/06/MXw3kHCmBjWBpKsBr31q.jpg)
Canada parliament briefly put on lockdown
కెనడాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంట్ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా వచ్చిన దుండగులు రాత్రంతా లోపలే ఉన్నాడని తెలిపారు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా ? లేదా ? అనేదానిపై స్పష్టత లేదు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పార్లమెంటు భవనంలోకి చొరబడచంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.
Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
పార్లమెంటు భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది అందరూ ఒకే గదిలోకి వచ్చి తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలో ఉన్న పలు ప్రదేశాలపై కూడా లాక్‌డౌన్ పెట్టారు. అలాగే పార్లమెంటుకు దగ్గర్లో ఉన్న రోడ్లని మూసివేస్తున్నామని.. ప్రజలు ఎవరూ కూడా అటువైపు రావొద్దని అధికారులు ఆదేశించారు. చివరికీ ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు.
ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ గత నెల 23వ తేదీన పార్లమెంటును రద్దు చేశారు. వాస్తవానికి అక్కడ అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దాదాపు ఆరు నెలలకు మందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులోకి దుండగుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. అందులో ఉండే సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లడం కోసం దుండగులు వచ్చాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్
telugu-news | canada | rtv-news