/rtv/media/media_files/2025/03/10/BVLVby71DN4pyptyA2DL.jpg)
Air India flight
Air India flight : ఈ మధ్య ఆకతాయిలు విమానాలకు, విమానశ్రయాలకు ఫోన్లు చేసి బాంబులు పెట్టామని బెదిరించడం సర్వసాధారణమై పోయింది. వారు చెప్పింది నిజమో అబద్దమో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తోంది. దీంతో విమాన ప్రయాణాలకు ఆలస్యం అవతోంది. అలాంటిదే ఈ రోజు కూడా జరిగింది. ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానాన్ని పైలట్లు టేకాఫ్ అయినచోటే దింపారు.
బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తోంది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు తెలపడంతో వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. అక్కడ ల్యాండ్ అయిన వెంటనే బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. అది నకిలీ కాల్ అని తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి 322 మంది ప్రయాణికులున్నారు. తనిఖీల అనంతరం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్ బయల్దేరే అవకాశం ఉందని ఎయిరిండియా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
గత డిసెంబర్‌లో అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్ లోని అక్టౌలో అది కూలిపోయింది. రష్యా క్షిపణి తాకడం వల్ల విమానం కూలిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగించింది.
Also Read : Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. హాజరైన సీఎం రేవంత్
Also read : చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు!