Bomb Cyclone : అమెరికాను వణికుస్తున్న బాంబ్ సైక్లోన్.. 10 వేల విమానాల రద్దు

గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా బాంబ్ సైక్లోన్ ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆకాశం నుంచి కురుస్తున్న మంచు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.

New Update
us

అమెరికా ఇప్పుడు గడ్డకట్టుకుపోతోంది. గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా బాంబ్ సైక్లోన్(Bomb cyclone) ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఆకాశం నుంచి కురుస్తున్న మంచు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఈ తుఫాన్ ప్రభావం దాదాపు ఆరున్నర కోట్ల మందిపై పడింది. న్యూయార్క్(new-york), బోస్టన్, మసాచుసెట్స్ వంటి ప్రధాన నగరాలు మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. రోడ్ ఐలాండ్‌ వంటి ప్రాంతాల్లో ఏకంగా రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

Also Read :  ఇరాన్‌పై ఏక్షణమైనా అమెరికా దాడి..!

న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు చేయకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. విమాన ప్రయాణాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 10 వేల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. నిన్న ఒక్కరోజే సుమారు 5,600 విమానాలు నిలిచిపోయాయి. బోస్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి కీలక విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. 

మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. న్యూజెర్సీ, డెలావేర్ వంటి ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 60 వేల మందికి పైగా కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడ్డకట్టే చలిలో కరెంట్ కూడా లేకపోవడంతో పరిస్థితి నరకాన్ని తలపిస్తోంది. అమెరికా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికీ, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో పనులు ముందుకు సాగడం కష్టంగా మారింది.

Also Read :  పక్కా ప్లాన్.. చిక్కిన డాన్! లవర్ కదలికలే డ్రగ్ లార్డ్ కొంపముంచాయా?

Advertisment
తాజా కథనాలు