USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్

బాంబ్ సైక్లోన్...ఇప్పుడు అమెరికాను వణికిస్తున్న విషయం. అక్కడ కాలిఫోర్నియాతో పాటూ మరి కొన్ని రాష్ట్రాలను ఈ సైక్లోన్ ముంచేయనుంది. భీకర వర్షాలు, గాలులతో పాటూ మంచు కూడా కురుస్తుందని హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. 

New Update
us

Bomb Cyclone: 

బాంబ్ తుఫాన్‌ తో అగ్ర రాజ్యం అమెరికా హడలెత్తిపోతోంది. అత్యంత శక్తివంతమైన ఈ సైక్లోన్ చాలా రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కారణంగా తీవ్ర ప్రళయం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  కాలిఫోర్నియా లాంటి స్టేట్స్‌లో భారీ విలయం సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సుమారు 8 ట్రిలియన్‌ గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

Also Read: HYD: వాళ్లు నమాజ్ చేస్తే...తాము చాలీసా చదువుతాము..రాజాసింగ్‌ వార్నింగ్

బాంబ్ సైక్లోన్ అంటే?

ఈ పదం బాబోజెనిసిస్ అనే దాని నుంది వచ్చింది. వాతావరణంలో అత్యంత వేగంగా మార్పులు చోటు చేసుకోవడాన్నే బాంబోజెనిసిన్ అంటారు. ఈ పదాన్ని 1980లో శాస్త్రవేత్తలు సృష్టించారు.  గంటల వ్యవధిలోనే తుపాను బలపడితే..దాన్ని బాంబ్‌ సైక్లోన్‌గా పిలుస్తారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో కనీసం 24 మిల్లీబార్లు అంతకంటే ఎక్కువ మేర వాతావరణ పీడనం పడిపోవడాన్ని బాంబ్ తుపానుగా పరిగణిస్తారు. ఇందులో హరికేన్‌ తరహాలో గాలులు వీచడంతోపాటు విపరీతంగా వర్షపాతం నమోదవుతుంది.

us

Also Read: Russia: ఉక్రెయిన్‌పై న్యూక్లియర్ అటాక్‌కు రెడీ అవుతున్న రష్యా

అమెరికా పశ్చిమ తీరంలో ఇప్పుడు బాంబ్ సైక్లోన్ కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగా కేటగిరి–4 పరిథితులు అంటే...అత్యంత విరీతమైన వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం వలన సౌత్ ఓరెగాన్ దక్షిణ ఓరెగన్‌, ఉత్తర కాలిఫోర్నియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Also Read: ఆసియా ఛాంపియన్స్‌లో ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళిన భారత మహిళల హాకీ జట్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు