Pakistan: పాక్ కు షాక్..214 మంది బందీలను చంపేసిన బీఎల్ఏ

పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ  చంపేసింది. వారి జవాన్లను రక్షించేందుకు గడువు ఇచ్చినా పట్టించుకోలేదని..అందుకే చంపేశామని ప్రకటించింది. 

author-image
By Manogna alamuru
New Update
pak

BLA

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రైలును హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికే దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఆ ట్రైన్‌లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని.. మిలటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. ఇందులో 190 మందిని పాక్ భద్రతా బలగాలు రక్షించాయి. కానీ మరో 214 మంది మాత్రం బీఎల్ఏ దగ్గరే ఉండిపోయారు. బలూచ్‌ మిలిటెంట్లు ఐదు వేరు వేరు ప్రాంతాల్లో బంధించినట్లు పాకిస్థా్న్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసిన రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులు, అదృశ్యమైన వాళ్లను 48 గంటల్లో విడిచిపెట్టాలని బీఎల్‌ఏ డిమండ్ చేసింది. లేకపోతే తమ దగ్గర ఉన్నవారందరినీ చంపేస్తామని చెప్పింది. 

అందరినీ చంపేశాం...

ఇప్పుడు తాజాగా తమ దగ్గర బందీగా ఉన్న 214 మందినీ చంపేశామని బలూచీ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. యుద్దఖైదీలను విడుదల చేయాలని పాక్ ఆర్మీకి 48 గంటలు గడువిచ్చాం..కానీ వారికి ఇచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నారు. పొగరుతో కాలదన్నారు. క్షేత్ర పరిస్థితులను పట్టించుకోలేదు. అందుకే 214 మందిని హతమార్చాం...ఈ విధంగా మా 12 మంది అమరవీరులకు నివాళులర్పించాం అంటూ బీఎల్ఏ ప్రకటించింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. అక్రమవలదారులను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈ రూల్ కు అక్కడి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. 

New Update
usa

H!-B Visa

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం రోజురోజుకూ మితిమీరిన రూల్స్ ను పెడుతోంది. తాజాగా మరో స్ట్రిక్ట్ రూల్ ను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం అమెరికా వచ్చిన ఏ దేశస్థుడు అయినా తమ వీసాలు లేదా గ్రీన్ కార్డులను 24 గంటలు తమ వద్దనే ఉంచుకోవాలని చెప్పింది. ఈ నియమం ఏప్రిల్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ప్రజలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్  ఈ నిర్ణయాన్ని తీసుకువచ్చారని చెబుతున్నారు. ఈ వివాదాస్పద నిర్ణయానికి అమెరికా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ప్రభుత్వంలో నమోదు చేసుకోవాలి మరియు వారి వద్ద పత్రాలను ఉంచుకోవాలి. 

అమెరికాలో అక్రమవలసదారులను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. దీని గురించి ముందుగా ఏమీ చెప్పలేదు కానీ నిర్ణయాన్ని మాత్రం అమల్లో పెట్టేసింది. అమెరికాలో చట్టాలా ప్రకారం దేశంలోకి అడుగు పెట్టిన ప్రతీవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇంతకు ముందు అంతా ఈ రూల్ ను కఠినంగా అమలు చేయకపోవడం వలన చాలా మంది వలసదారులు వచ్చేశారని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దానిని అరికట్టడానికే రిజిస్ట్రేషన్  ప్రక్రియను తప్పనిసరి చేయడమే కాకుండా..పత్రాలను కూడా వెంట తీసుకెళ్ళాలని చెబుతున్నామని వివరించారు.  అయితే ఈ కొత్త నియమం అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా నకిలీ పత్రాలతో నివసిస్తున్న వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. దీంతో పాటూ 14 ఏళ్లు పైబడిన వారు మరియు 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నవారు, ఫారం G-325R నింపడం ద్వారా ప్రభుత్వంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, అతని/ఆమె తల్లిదండ్రులు అతని/ఆమెను నమోదు చేసుకోవాలి. అలా చేయకపోతే జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

H-1B వీసా మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ..

అయితే, H-1B వర్క్ వీసా, స్టూడెంట్ వీసా (F1 మొదలైనవి) లేదా గ్రీన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నవారు మళ్ళీ ఫారమ్ G-325R నింపాల్సిన అవసరం లేదు. వారు ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటారు కనుక ఈ రిజిస్టర్ ప్రక్రియ వారికి మినహాయించబడింది. అయితే, వారు తమ చెల్లుబాటు అయ్యే పత్రాలను (వీసా, పాస్‌పోర్ట్, I-94, గ్రీన్ కార్డ్ మొదలైనవి) ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలి మరియు US ప్రభుత్వ అధికారులు కోరినప్పుడల్లా ఈ పత్రాలను సమర్పించాలి. 

today-latest-news-in-telugu | usa | new-rule | h1b visa

Also Read: TS: సలేశ్వరానికి వేలల్లో భక్తులు..శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్

Advertisment
Advertisment
Advertisment