Bill Gates: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం.. ఇద్దరు రష్యన్‌ మహిళలతో సంబంధాలున్నట్లు అంగీకరించిన బిల్‌గేట్స్‌..

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వ్యవహారంలో బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఫైల్స్‌లో తన పేరు ఉండటంపై తాజాగా మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ మరోసారి స్పందించారు.

New Update
Bill Gates Apologizes to Foundation Staff Over Epstein Ties

Bill Gates Apologizes to Foundation Staff Over Epstein Ties

ఎప్‌స్టీన్ ఫైల్స్‌ వ్యవహారంలో బడా వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ ఫైల్స్‌లో తన పేరు ఉండటంపై తాజాగా మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ మరోసారి స్పందించారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉండడంపై గేట్స్‌ ఫౌండేషన్ సిబ్బందికి ఆయన క్షమాపణలు చెప్పారు. తన పెళ్లి సమయంలో ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే తాను చట్టవిరుద్ధంగా ఎలాంటి పని చేయలేదని, ఎప్‌స్టీన్ నేరాల్లో భాగస్వామ్యం కాలేదని స్పష్టం చేశారు

Also Read: ఇండియాకు ట్రంప్ 'బిగ్ షాక్'.. మళ్లీ మొదలైన ట్రేడ్ వార్.. వాటిపై 126% సుంకాలు!

ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం.. టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గేట్స్‌ ఫౌండేషన్ సిబ్బందితో బిల్‌గేట్స్‌ ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వ్యవహారం గురించి మాట్లాడారు. తనకు తన పెళ్లి సమయం అప్పుడు ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. కానీ ఎప్‌స్టీన్ నేరాల్లో తాను పాల్గొనలేదని తెలిపారు. ఎప్‌స్టీన్‌తో భేటీ తర్వాత అతడి వద్ద ఉండే అసిస్టెంట్లు తనతో ఫొటోలు దిగినట్లు చెప్పారు. తాను వాళ్లని ఎప్పుడు కూడా కలవలేదని స్పష్టం చేశారు. అయితే ఎప్‌స్టీన్‌తో కొన్నిసార్లు కలవడం, తాను చేసిన ఈ పొరపాటు వల్ల గేట్స్ ఫౌండేషన్ సిబ్బందిని కూడా ఇందులోకి లాగడం తప్పనేనని విచారం వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పుకు, ఈ వ్యవహారంలో ఇరుకున్న సిబ్బందికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. 

Also Read: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. రంగంలోకి సూపర్ ట్యాంకర్లు

ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి 2011లో ఎప్‌స్టీన్ దోషిగా తేలాడు. అది జరిగిన మూడేళ్ల తర్వాత అతడిని కలిసినట్లు బిల్‌గేట్స్‌ చెప్పారు. అయితే ఎప్‌స్టీన్‌కి సంబంధించిన విషయాలను తాను చెక్‌ చేసుకోలేదన్నారు. దీనిపై తన మాజీ భార్య మిలిందా గేట్స్‌ ఎప్పుడూ కూడా సందేహంగా ఉండేదని అయినప్పటికీ తాను అతడితో పరిచనం కొనసాగించినట్లు తెలిపారు. మరోవైపు  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌కు సంబంధించి ఇప్పటిదాకా అమెరికా న్యాయశాఖ 30 లక్షల పేజీలను రిలీజ్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు