/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
H1B Visa
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలని కలలుగనే భారతీయులకు బిగ్ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అమెరికన్ ఐటీ కంపెనీ యజమాని భారతీయ టెకీకి చుక్కలు చూపించాడు. లక్ష డాలర్లు ఇస్తావా లేక నీ హెచ్-1బీ వీసా హోదా వదులుకుని దేశం విడిచిపోతావా? అంటూ టెకీ ఉద్యోగికి కంపెనీ యజమాని టార్చర్ పెట్టాడు. బాధితుడు తట్టుకోలేక టెక్సాస్ కోర్టులో దావా వేయడంతో ఈ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
భారత్‌కు చెందిన రిషికేశ్ రాజ్ మీసాలా అనే యువకుడు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లాడు. 2023లో అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయగానే.. సాయి జితేందర్ కలగర అనే వ్యక్తికి చెందిన టెక్సాస్ ఐటీ కంపెనీలో హెచ్-1బీ వీసా స్పాన్సర్‌షిప్‌తో ఉద్యోగం సంపాదించాడు. అయితే కంపెనీ అతడిని రిజర్వ్ బెంచ్‌లో ఉంచింది. అమెరికా నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్నవాళ్లకు ప్రతి నెలా జీతం స్లిప్స్ రావాలి. అప్పుడే వారు అక్కడ చట్టబద్ధంగా ఉంటున్నట్లు లెక్క. లేదంటే దేశం విడిచి రావాల్సిందే. ఈ బలహీనతనే కంపెనీ యజమాని క్యాష్ చేసుకోవాలని చూశాడు.
ఇది కూడా చూడండి: Crime News : ముస్సోరీ హనీమూన్‌లో విషాదం... ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
ఉద్యోగం ఇవ్వకపోయినా సరే.. అమెరికాలో హెచ్-1బీ హోదా కొనసాగాలన్నా, పే స్లిప్స్ చేతికి రావాలన్నా తమకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని రిషికేశ్‌ను కంపెనీ యాజమాన్యం వేధించడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వనని రిషికేశ్ ఎదురుతిరగడంతో.. కంపెనీ ప్రతినిధులు అతడిని దారుణంగా బ్లాక్‌మెయిల్ చేశారు. లొంగకపోతే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేసి దేశం నుంచి బహిష్కరణ చేయిస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా భారత్‌లో ఉంటున్న రిషికేశ్ తండ్రికి కూడా ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేశారు. దీంతో భయపడిపోయిన రిషికేశ్.. తన వీసా కాపాడుకోవడానికి ఇప్పటివరకు కంపెనీకి దాదాపు 8,800 డాలర్లు (సుమారు రూ.7.3 లక్షలు) చెల్లించాడు.
ఇది కూడా చూడండి: BIG BREAKING : అక్రమాస్తుల కేసు : డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్!
ఇక కంపెనీ వేధింపులు భరించలేక రిషికేశ్ అమెరికాకు చెందిన 'బానియాస్ లా' అనే ప్రముఖ ఇమిగ్రేషన్ లీగల్ సంస్థను ఆశ్రయించి కోర్టులో కేసు వేశాడు. బాధితుడికి ఇవ్వాల్సిన జీతాలు, అతడి నుంచి బలవంతంగా వసూలు చేసిన డబ్బులు అన్నీ కలిపి ఆ కంపెనీ ఓనర్ సాయి జితేందర్ రూ.97,248 డాలర్లు అంటే దాదాపుగా రూ.81 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని లాయర్లు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది.
ఇది కూడా చూడండి: Lashkar Bonalu Jatara 2026 : లష్కర్ బోనాల జాతర 2026...ఉత్సవాల షెడ్యూల్ విడుదల!
Follow Us