/rtv/media/media_files/2025/03/10/GrAWjXHDJi53BVsYWGac.jpg)
Lalit Modi
ఐపీఎల్ ఫౌండర్, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి ఇటీవల వనువాటు పాస్‌పోర్టు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా లలిత్ మోదీ ఓ కీలక ట్వీట్ చేశారు. ''వనువాటు అందమైన దేశం. స్వర్గంలా ఉంది. మీ ట్రావెల్ లిస్టులో దీన్ని చేర్చాల్సిందే'' అంటూ అక్కడ దిగిన ఫొటోలు షేర్ చేశారు. అయితే ఆయనకు జారీ అయిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనువాటు దేశ ప్రధాని చెప్పిన కొన్ని గంటలకే లలిత్ మోదీ ఇలా ఎక్స్‌లో పోస్టులు చేయడం ప్రాధాన్యం సంతరించకుంది.
Vanuatu a beautiful country. You must put on your bucket list. Away from all the pollution and noise. Truly heavenly country. 🏝️🇻🇺🐋🐳🐠🐟🐬🦀🦞🦑🐙🪼🐬#vanuatu pic.twitter.com/GTBZmHnkuL
— Lalit Kumar Modi (@LalitKModi) March 10, 2025
Also read: సైబర్ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి
ఇదిలాఉండగా.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ..2010లో భారత్ నుంచి పారిపోయి లండన్ లో ఉంటున్నారు. ఐపీఎల్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఈయన కోట్లాది రూపాలు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆయన భారత్‌లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు లండన్‌లో అజ్ఞాతవాసం చేస్తున్న లలిత్ మోదీ తాజాగా తన పాస్ పోర్ట్ ను అక్కడి భారత హైకమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని చెప్పారు. దీనికి కారణం ఆయనకు వనువాటు పౌరసత్వం రావడమే.
Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
దీంతో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చివరికీ ఆయనకు జారీ అయిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనవాటు ప్రధానమంత్రి జోథం నపాట్ అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్వదేశంలో దర్యాప్తు నుంచి తప్పించుకనేందుకు వనువాటు పౌరసత్వం పొందినట్లు తెలుస్తోంది.. అందుకే ఆయన పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని ఆ ప్రధాని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా లలిత్ మోదీ వనువాటులో దిగిన ఫొటోలు షేర్ చేయడం చర్చనీయమవుతోంది.
Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్ షాక్.. రావడం కష్టమే