/rtv/media/media_files/2025/01/16/Xszu6SGjbCgBevwanMOk.jpg)
barack obama michelle obama Photograph: (barack obama michelle obama)
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి బరాక్ ఒబామా హాజరు అవుతుండగా.. మిచెల్ ఒబామా మాత్రం దూరంగా ఉంటున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిచెల్ హాజరుకాలేదు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయాని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పలువురు నెటిజన్లు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. 2000 సంవత్సరంలోనే బరాక్ ఒబామాకు.. మిచెల్ విడాకులు ఇవ్వాలని అనుకుందని.. 2012లో విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు.
De fortes rumeurs circulent sur un éventuel divorce entre Michelle et Barack Obama.
— SILVANO TROTTA OFFICIEL (@silvano_trotta) January 16, 2025
Les spéculations vont bon train car Michelle a déjà manqué les funérailles de Jimmy Carter et manquera à nouveau l'investiture de Donald Trump, à laquelle Barack assistera seul.
Ces absences… https://t.co/l1UEokICMW
1992లో పెళ్లి.. ఇద్దరు కుమార్తెలు
1989లో బరాక్ ఒబామా, మిచెల్ ఒబామాలకు పరిచయం ఏర్పడింది. 1992లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, మాలియా, సాషా, మాలియా, 1998లో, మాలియా 2001లో జన్మించారు. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆమెరికాకు అమెరికా 44వ అధ్యక్షుడు. అమెరికా ఖండం బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. అధ్యక్షుని పదవి చేపట్టిన తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పెళ్లాయ్యక తమ మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని వాటిని ఎదురుకునేందుకు కౌన్సెలింగ్ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read : Trump: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్న ట్రంప్..కారణమేంటి