Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు.

New Update
sheik

ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై అల్లరు చెలరేగడంతో అప్పటి ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.  
 

Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

హసీనాపై 60 ఫిర్యాదులు

ప్రస్తుతం మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలతో ఆమెకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై ట్రైబ్యునల్ కూడా ఇటీవలే దర్యాప్తు చేసింది. భారత్‌లో ఉంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని.. ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ ఇటీవలే చెప్పారు. ఆమెను ఎలాగైనా బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ క్రమంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.  

Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

పాస్‌పోర్టు రద్దు

హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్ పార్టీ (BNP) కూడా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా ఇప్పటికే రద్దయిపోయింది.  హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పార్టు రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఆగస్టు 5న ప్రధాని పదవి నుంచి దిగిపోయాక భారత్‌కు వచ్చిన షేక్ హసీనా ఆ తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. 

Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

మరోవైపు హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రస్తుతం అక్కడ ఉన్న యూనస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలోనే చెప్పింది. హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలా ? వద్దా ? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొంది. అయితే తాజాగా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేయడంతో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. 

Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chat GPT: డాక్టర్లకు తెలియలేదు..కానీ చాట్ జీపీటీ గుర్తుపట్టింది..

డాక్టర్లకు సాధ్యం కానిది చాట్ జీపీటీ చేసి చూపించింది. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఎదురైన ఆరోగ్య సమస్యను చాట్ జీపీటీ అవలీలగా గుర్తుపట్టింది. పదిహేడు మంది డాక్టర్లు చేయలేని పనిని చాట్ జీపీటీ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
CHat gpt

ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది అంటే ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది నిజమని ప్రూవ్ అవుతోంది. తాజాగా చాట్ జీపీటీ చేసిన ఓ పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. డాక్టర్లకు అంతుపట్టని సమస్యను ఇట్టే పసిగట్టింది చాట్ జీపీటీ. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఓ వింత సమస్య వచ్చింది. బాబు పళ్ళు సరిగ్గా పెరగకపోవడం, ఉన్నట్టుండి శరీరం తూలటం వంటి లక్షణాలతో బాధపడతున్నాడు. అలెక్స్ ను అతని పేరెంట్స్ చాలా ఆసుపత్రులు తిప్పారు. పదిహేడు మంది డాక్టర్లు అతనికి అన్ని పరీక్షలూ చేశారు. కానీ జబ్బేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఎంఆర్ఐ లాంటి పెద్ద పరీక్షలను కూడా చేయించారు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు.

రిపోర్టులు చూసి చెప్పేసింది..

డాక్టర్లు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన అలెక్స్ తల్లిదండ్రులకు చాట్ జీపీటీ గుర్తుకు చవ్చింది. అంతే దానికి ఎంఆర్ఐ రిపోర్టులు, లక్షణాలు అన్నీ వివరంగా చెప్పారు. ఒక్కొక్కటీ ఓపికగా వివరించారు. అన్నీ చెప్పగానే కొద్ది నిమిషాల్లో చాట్ జీపీటీ పిల్లాడికి ఉన్న జబ్బును గుర్తుపట్టింది. దాన్ని ‘టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌’ సమస్యని నిర్ధరించింది. ఇదో అరుదైన నాడీ సమస్యని తేల్చి చెప్పింది. ఈ జబ్బు వెన్నెముకను ఎఫెక్ట్ చేస్తుంది. ఎదుగుదల, కదలికలు వంటి వాటిని ప్రభావితం చేసి దెబ్బతీస్తుంది. ఇవన్నీ చాట్ జీపీటీ తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. అంతేకాదు ఈ జబ్బు పేరుతో ఒక ఫేస్ బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది. ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ ను కలవమని కూడా సలహా ఇచ్చింది. 

చాట్ జీపీటీ సలహాతో అలెక్స్ తల్లిదండ్రులు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అక్కడ అందిన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళారు. న్యూరో సర్జన్ ను కలిశారు. చాట్ జీపీటీ చెప్పిన వివరాలు అన్నీ ఆయనకు కూడా తెలిపారు. అనంతరం డాక్టర్ సలహా మేరకు అలెక్స్ కు ఆపరేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అలెక్స్ తల్లి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొంతమంది ఏఐ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే..మరి కొంత మంది అన్ని సార్లు అలా జరగదని అంటున్నారు. చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎప్పటికీ డాక్టర్లు ప్రత్యామ్నాయం కాలేవని హెచ్చరిస్తున్నారు. 

 today-latest-news-in-telugu | chat-gpt | doctors | kid

Also Read: USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్

 

Advertisment
Advertisment
Advertisment