పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తీవ్రవాదులు రైలును హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. బీఎల్‌ఏ పాకిస్థాన్‌లో గతంలో కూడా అనేక దాడులు చేసింది. ఈ సంస్థ ఇలా ఎందుకు చేస్తోందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రైలును హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్‌ చేశారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికే దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఆ ట్రైన్‌లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని.. మిలటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. అయితే బీఎల్‌ఏ పాకిస్థాన్‌లో గతంలో కూడా అనేక దాడులు చేసింది. అసలు ఈ బలిత్ లిబరేషన్ ఆర్మీ ఇలా ఎందుకు దాడులు చేస్తోంది. దీని డిమాండ్స్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!

బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలా ఏర్పడింది

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక పాకిస్థాన్‌ భారత్‌ను నుంచి వీడిపోయి మరో దేశంగా సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్‌లో బలోచిస్థాన్‌ స్వతంత్ర్య రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్థాన్‌ బలోచిస్థాన్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటినుంచి బలోచిస్థాన్ ప్రజలు తమ రాజకీయ, సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. 1970లో బలూచ్ ప్రజలు పాకిస్థాన్‌ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు. కానీ పాకిస్థాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్‌ ప్రజల పోరాటాన్ని అణిచివేసింది. ఈ క్రమంలోనే పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి. అలా ఏర్పడిందే బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ (BLA).  

ప్రత్యేక ప్రాంతం కావాలి

పాకిస్థాన్ నుంచి విడిపోయి బలూచిస్థాన్‌ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలని, తమకు స్వయం నిర్ణయాధికారం ఉండాలని బీఎల్‌ఏ డిమాండ్ చేస్తోంది. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ వేర్పాటువాద సంస్థ పాకిస్థాన్‌ సైన్యంపై దాడులకు పాల్పడుతునే ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో సహా అమెరికా, యూకే బీఎల్‌ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఈ బలూచిస్థాన్ ప్రాంతం అనేది నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్‌లలో వ్యాపించి ఉంది.  

చైనా కుట్ర ?

అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEK) ప్రాజెక్టును చేపట్టారు. ఇది బలూచిస్థాన్‌ మార్గం గుండా వెళ్తోంది. ఆర్థిక వృద్ధికి సిపెక్‌ దోహదపడుతుందని పాక్‌ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తమ ప్రాంత వనరులను కొల్లగొట్టేందుకు ఇదో ఎత్తగడ అని బలూచిస్థాన్‌ వాసులు వాదిస్తున్నారు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. అందుకే ఈమధ్య కాలంలో సిపెక్‌కు చెందిన ప్రాజెక్టులు, సిబ్బందిపై, చైనీయులపై అక్కడ దాడులు పెరిగిపోయాయి. 

Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

మరోవైపు బలూచ్‌ తిరుగుబాటును పాకిస్థాన్‌ అణిచివేస్తుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2011 నుంచి దాదాపు 10 వేల మంది బలూచ్‌ ప్రజలు అదృశ్యమయ్యారు. అయితే పాకిస్థాన్‌లో బలూచిస్థాన్‌ వేర్పాటువాదులు వరుసగా దాడులు చేస్తూనే ఉన్నారు. రైల్వేలైన్లు, పోలీస్ స్టేషన్లు, వాహనాలపై దాడులకు తెగబడుతున్నారు. బస్సులో నుంచి ప్రయాణికులను కిందకి దించి వాళ్ల గుర్తింపు కార్డులు చూసి మరి కాల్చిచంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

అయితే ఇప్పుడు తాజాగా బలూచ్ లిబరేషన్‌ ఆర్మీ.. ట్రైన్‌ను హైజాక్ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆరుగురు మిలటరీ సిబ్బంది కూడా మృతి చెందారని ఆ సంస్థ ప్రకటించింది. ఒకవేళ తమపై సైనిక చర్యలకు దిగితే ప్రయాణికులందరినీ చంపేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఘటనాస్థలాకి పాక్ సహాయక, భద్రత బలగాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment