అమెరికాలో భారతీయ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష

మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకున్నందుకు అమెరికా కోర్టు ఓ భారతీయ యువకుడికి 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 31 ఏళ్ల వయస్సు ఉన్న ఈ యువకుడు తక్కువ వయస్సు అని చెప్పి మైనర్లను లైంగికంగా వేధించాడు. పోలీసుల దర్యాప్తులో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధించింది.

New Update
Child Abuse

Child Abuse Photograph: (Child Abuse)

మైనర్లను నమ్మించి లైంగికంగా లోబరుచుకోవడంతో ఓ భారతీయ యువకుడికి అమెరికా 35 ఏళ్లు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓక్లహామా రాష్ట్రం ఎడ్మండ్‌ నగరంలో సాయికుమార్‌ కుర్రేముల ఉంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా చిన్నారులతో పరిచయం పెంచుకునేవాడు. 

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి..

తన వయస్సు కూడా తక్కువేనని మాయ మాటలు చెప్పి లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ తర్వాత చెప్పినట్లు చేయకపోతే ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించేవాడు. అయితే గతేడాది ఈ యువకుడిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా ఒక 20 మంది మైనర్ అమ్మాయిలను బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆ యువకుడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

ఇదిలా ఉండగా ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ వెళ్తున్నాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అర్థరాత్రి 2 గంటలకు పెద్ద కూతురు (12) వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెనుక వెళ్లిన ఓ వ్యక్తి ఒక అరగంట పాటు ఆమెను బంధించి వేధించాడు. వాటిని మొబైల్ ఫోన్‌లో కూడా చిత్రీకరించాడు. అతను వదిలిపెట్టిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫోన్‌ చేసి కంప్లైట్ చేశారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UN: భారత్ , పాక్ సంయమనం పాటించాలి..ఐక్యరాజ్యసమితి

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ లు యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. దీనికి సంబంధించి రెండు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరింది. 

New Update
Pak

UN Security

పహల్గామ్ దాడి భారత్, పాకిస్తాన్ ల మధ్య పరిస్థితిని మార్చేసింది. దీనిలో ఇండియాలో 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారత్ కోపంతో రగిలిపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. దీనిని నెమ్మది చేయాల్సిన పాకిస్తాన్ మరింత ఎగదోస్తోంది. బార్డర్ లో దానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. ఇండియా కూడా వార్ తప్పదేమోననే ఆలోచనలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

భారత్ , పాకిస్తాన్ లు రెండూ సంయమనం పాటించాలని యూఎస్ కోరింది. పరిస్థితి మరింత దిగజారనివ్వొద్దని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ ఆంటోనియో గుట్రెస్ పిలుపునిచ్చారు. కాశ్మీర్ లో జరిగిన దాడిని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని గుట్రెస్ కోరారు. 

భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్య చేసింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై ఓ క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసింది. ఇది భారతీయ నావికా దళ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పవాల్గామ్‌లో టెర్రర్ అటాక్ కారణంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు రద్దు అవుతున్నాయి.

: today-latest-news-in-telugu | un | inida | pakistan

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

Advertisment
Advertisment
Advertisment