White house: ప్రపంచంలోనే నంబర్ 1 సెక్యూరిటీ ఫెయిల్.. వైట్ హౌస్ వద్ద కాల్పుల వెనుక అసలు కారణాలివే!

అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ చుట్టూ హైలెవల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి వైట్ హౌస్ పరిసరాల్లో కాల్పులు జరుగుతున్నాయి.

New Update
us

white house

అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ చుట్టూ హైలెవల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి వైట్ హౌస్ పరిసరాల్లో కాల్పులు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే హైలెవెల్ సెక్యూరిటీ ఉన్న ఈ వైట్ హౌస్ భద్రతలో అసలు ఎక్కడ లోపాలు ఏర్పడ్డాయి? ఎందుకు భద్రతా వ్యవస్థ విఫలమవుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!

గుర్తించినా నష్టం తప్పదు..

అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం 'యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్' ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణ పొందిన ఏజెంట్లను రంగంలోకి దించుతుంది. అయితే ఇటీవల వైట్ హౌస్ పరిసరాల్లో వరుసగా జరుగుతున్న కాల్పులతో భద్రతా లోపం ఏర్పడిందని స్పష్టం అవుతుంది. అయితే ఈ వైట్ హౌస్ రక్షణ బాధ్యత కేవలం ఒక్క సంస్థది మాత్రమే కాదు.. సీక్రెట్ సర్వీస్‌తో పాటు మెట్రోపాలిటన్ పోలీస్, నేషనల్ పార్క్ పోలీస్ వంటి పలు విభాగాలు కూడా ఇందులో కలిసి పనిచేస్తాయి. ఏదైనా ఒక విభాగం ఏదైనా లోపాన్ని గుర్తించి.. మరో విభాగానికి చేరేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 2024లో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన దాడి విచారణలో కూడా ఇదే తేలింది. వేర్వేరు ఏజెన్సీల మధ్య రియల్ టైమ్ సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడం వల్ల దుండుగులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: ఫల్తా రీపోలింగ్‌.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

సాధారణంగా ఏదైనా ఉగ్రవాద సంస్థ దాడికి ప్లాన్ చేస్తే ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే పసిగట్టగలవు. కానీ.. ఇప్పుడు భద్రతా దళాలకు కొందరు వ్యక్తులు చేసే దాడులు పెద్ద సవాలుగా మారాయి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు లేదా రాజకీయ ఆవేశంతో ఉన్నవారు ఎవరికీ చెప్పకుండా ఒక్కరే ఆయుధంతో వైట్ హౌస్ గేట్ల వద్దకు వచ్చి కాల్పులు జరుపుతున్నారు. మే 23న జరిగిన నసీర్ బెస్ట్ ఘటన కూడా ఇలాంటిదే. ఇలాంటి వ్యక్తుల ఆలోచనలను ముందే కనిపెట్టే సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే అమెరికాలో ఉన్న స్వేచ్ఛాయుత గన్ కల్చర్ వైట్ హౌస్ భద్రతపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఎవరి వద్ద ఆయుధం ఉందో.. ఎవరు సాధారణ పౌరుడో గుర్తించడం సెక్యూరిటీ బలగాలకు కష్టమవుతోంది. ముఖ్యంగా వైట్ హౌస్ బయటి గేట్ల వద్ద పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దుండగులు ఈ రద్దీని ఒక కవచంలా వాడుకుని.. అకస్మాత్తుగా తుపాకీ తీసి కాల్పులు జరుపుతున్నారు. సెక్యూరిటీ ఏజెంట్లు స్పందించి వారిని అడ్డుకునే లోపే ప్రాణనష్టం జరుగుతోంది.

బయట ఎన్ని దాడులు జరిగినా.. అధ్యక్షుడికి మాత్రం అత్యున్నత స్థాయి రక్షణ ఉంటుంది. వైట్ హౌస్ భూగర్భంలో ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అనే ఒక అభేద్యమైన బంకర్ ఉంది. ఇది అణు దాడులను కూడా తట్టుకోగలదు. బయట చిన్నపాటి అలజడి జరిగిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం అధ్యక్షుడిని క్షణాల మీద ఈ సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. రక్షణ వ్యవస్థలో ఎన్ని మార్పులు చేసినా.. మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం తుపాకులే కాకుండా సామాజిక నిఘాను పెంచినప్పుడే వైట్ హౌస్ కు పూర్తి రక్షణ లభిస్తుంది.

Advertisment
తాజా కథనాలు