/rtv/media/media_files/2025/03/09/SowVXpURtIdPiNh14qvr.jpg)
Hindu temples Photograph: (Hindu temples)
ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికాలోని హిందూ దేవాలయంపై దాడి చేశాడు. దక్షిణ కాలిఫోర్నియాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటైన శ్రీ స్వామినారాయణ మందిరంపై దాడి చేసి భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణకు ముందు ఇలా జరగడంతో BAPS సంస్థ ఆందోళన చెందుతోంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
In the face of another Mandir desecration, this time in Chino Hills, CA, the Hindu community stand steadfast against hate. Together with the community in Chino Hills and Southern California, we will never let hate take root. Our common humanity and faith will ensure that peace…
— BAPS Public Affairs (@BAPS_PubAffairs) March 8, 2025
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
కేవలం హిందూ ఆలయాలనే టార్గెట్ చేసి..
కేవలం హిందూ ఆలయాలను టార్గెట్‌లో దాడికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ విషయాన్ని BAPS సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ద్వేషం ఎప్పటికీ గెలవదని, శాంతి, కరుణ మాత్రమే ఎప్పటికైనా గెలుస్తాయని తెలిపింది. అయితే ఈ హిందూ దేవాలయంపై జరిగిన దాడికి సంబంధించి చినో హిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉత్తర అమెరికా హిందూ కూటమి (CoHNA) ఈ సంఘటనను ఖండించింది. మరో హిందూ దేవాలయంపై ధ్వంసం చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!