/rtv/media/media_files/2025/03/19/MQ61qAml7QRUONLNDo94.jpg)
Sunita Williams
Sunita Williams : అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి రావడంతో జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ఉద్వేగానికి గురిచేశాయి. కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తికావాల్సిన ఆమె ప్రయాణానికి ఏకంగా తొమ్మిది నెలలు పట్టింది. దీంతో ఆమె భూమిపైకి తిరిగి రావడాన్ని అంతా ఆసక్తిగా గమనించారు. ఈ నేపథ్యంలో భారత సంతతి వ్యోమగామి సునీతకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గురించి విద్యాశాఖ పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చారు. అదెక్కడో కాదు మన తెలుగు రాష్ర్టంలోనే. అవును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 2013లో పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చి విద్యార్థుల్లో స్ఫూర్తినింపే ప్రయత్నం చేసింది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
సునీతా విలియమ్స్ గురించి 2013లో తొమ్మిదో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో 11వ పాఠంగా చేర్చారు. భూకక్ష్యలో నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ సునీత. అంతరిక్షంలో అత్యధిక కాలం (195 రోజులు) గడిపిన, నడిచిన మహిళగా సునీత రికార్డు సృష్టించారని ఆ పాఠ్యపుస్తకంలో పేర్కొన్నారు. ఆమె తొలిసారి 2006 డిసెంబరు నుంచి 2007 జూన్ వరకు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షంలోకి అడుగు పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి అనే ప్రశ్నకు.. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై నడవటాన్ని తాను చూశానని, ఆ దృశ్యం నుంచి ప్రేరణ పొందానని, అదే రోజు తాను కూడా వ్యోమగామి కావాలని నిర్ణయించుకున్నానని సమాధానమిచ్చినట్లు పాఠంలో పొందుపరిచారు. భావి భారత పౌరులకు మీరిచ్చే సందేశం ఏమిటి అన్న ప్రశ్నకు.. ‘భారత్ ప్రతిభ ఉన్న దేశం. ఇక్కడ గ్రామాల్లోనూ ప్రతిభావంతులైన పిల్లలున్నారు. అమ్మాయిల్లో కూడా ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. బాగా చదువుకున్న తర్వాత దేశం పేరును ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుతూ ముందుకు సాగాలి’ అని ఆమె సమాధానం ఇచ్చినట్లు పుస్తకంలో పొందుపరిచారు.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
సునీత విదేశాల్లో పెరిగినప్పటికీ నేటికి భారత, స్లొవేనియా సంప్రదాయాలను గౌరవిస్తారు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రతిసారి సంప్రదాయ వస్తువులను వెంట తీసుకొనే వెళ్లారు. ఒకసారి స్లొవేనియా పతాకంతోపాటు ఆ దేశానికి చెందిన ఓ తినుబండారాన్ని, భారత్‌కు సంబంధించి ఓ సమోసాను వెంట తీసుకెళ్లారు. గణేశుడి విగ్రహాన్ని సైతం తీసుకెళ్లినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.హిందూ మతాన్ని ఆచరించే సునీత.. 2006లో భగవద్గీతను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లారు. రెండోసారి వెళ్లినప్పుడు ఓం గుర్తును, ఉపనిషత్తుల కాపీని వెంటపెట్టుకొని వెళ్లారు.గుజరాత్‌లోని ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం. భారత్‌లో రెండుసార్లు పర్యటించారు. 2007లో అక్కడ పర్యటించిన సునీత.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.
Also read; Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!