US Iran War : ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశంపై 50శాతం టారిఫ్‌లు..ట్రంప్ మరో వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ మరోసారి బిగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. సీజ్‌ఫైర్‌ తర్వాత ఇరాన్‌ కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. తక్షణమే 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.

New Update
Donald Trump

Donald Trump

US Iran War : ఇరాన్‌, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఒకరినొకరు వార్నింగ్‌లు ఇచ్చుకోవడం మాత్రం మానలేదు. తాజాగా ఇరాన్‌కు ట్రంప్ మరో సారి బిగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. సీజ్‌ ఫైర్‌ తర్వాత ఇరాన్‌ కు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.‘ట్రూత్‌ సోషల్‌’లో  ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని తాజాగా హెచ్చరించారు. తక్షణమే 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే ట్రంప్‌  పరోక్షంగా రష్యా, చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. యుద్ధంలో ఇరాన్‌కు ఆ రెండు దేశాలు సాయం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ట్రంప్‌ తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతకరించుకున్నాయి.

సుంకాల విషయంలో  ఎటువంటి మినహాయింపులు లేవని ట్రంప్‌ తేల్చి చెప్పారు. ఇరాన్‌లో ఇకపై ఎలాంటి యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవని తేల్చిచెప్పారు. ఇరాన్‌ పూర్తిగా యూరేనియం శుద్ధిని నిలిపివేయాలని ఆదేశించాడు.పలు అంశాలపై ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్‌తో కలిసి పని చేయడానికి అమెరికా సన్నద్ధమవుతోందని ట్రంప్‌ తెలిపారు.

ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగిందన్న ట్రంప్‌ ..ఇరాన్‌కు ఆయుధాలు సరాఫరా చేస్తే సుంకాలు తప్పవన్నారు. ఇరాన్‌కు అంటుకున్న అణుమరకల్ని తొలగిస్తామన్నారు.ఇరాన్‌‌, అమెరికాకు మధ్య పలు అంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని ట్రంప్‌ తెలిపారు.ఇరాన్‌లో పాలన మార్పును ట్రంప్‌ స్వాగతించారు.ఇరాన్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కాగా, ట్రంప్ హెచ్చరికతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు