/rtv/media/media_files/XGNiNT6FpFAUP4II1eSN.jpg)
ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ విషాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్ రాజధాని టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నారని అక్కడి అధికారులు గుర్తించారు. అలాగే గని లోపల మరో 24 మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
Also read: జోబైడెన్ దంపతులకు మోదీ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?
ఇదిలాఉండగా.. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం చేయాలన్నారు. మరోవైపు ఈ ఘటనపై కూడా విచారణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
Also read: శ్రీలంక ప్రెసిడెంట్ రేసులో దూసుకుపోతున్న దిసానాయకే..
A methane leak caused an explosion in a coal mine in Tabas in Iran's South Khorasan province.
— Alireza Talakoubnejad (@websterkaroon) September 22, 2024
There are several dozen dead & injured miners & at least 24 still trapped inside. Emergency personnel are trying to save them right now. pic.twitter.com/rMm7buGy0G