Nepal Bus Accident : ఘోర ప్రమాదం: నదిలో పడ్డ బస్సు.. 18 మంది స్పాట్ డెడ్!

నేపాల్‌లోని ధాడింగ్ జిల్లా గజూరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కంట్రోల్ తప్పి పృథ్వీ హైవే పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది.

New Update
bus accident

అందమైన ప్రయాణం అది.. కానీ మృత్యువు ఏ రూపంలో పొంచి ఉందో ఆ ప్రయాణికులకు తెలియదు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మృత్యువు బస్సు రూపంలో త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది(Bus Accident). చీకటిలో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే 18 నిండు ప్రాణాలు ఆ నదిలో కలిసిపోయాయి. పొఖారా నుండి ఖాట్మండు వెళ్తున్న ఆ బస్సు, ప్రయాణికుల పాలిట యమపాశంలా మారింది.

నేపాల్‌(Nepal Bus Accident) లోని ధాడింగ్ జిల్లా గజూరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తున్న ప్యాసింజర్ బస్సు కంట్రోల్ తప్పి పృథ్వీ హైవే పక్కనే ఉన్న త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :  మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి

Also Read :  అమెరికా, ఇరాన్ యుద్ధం.. ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్‌?

గాయపడిన ప్రయాణికులను

సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.  ప్రమాద స్థలం నుండి పదిహేడు మృతదేహాలను వెలికితీశామని, 28 మంది గాయపడిన ప్రయాణికులను బస్సు నుండి రక్షించామని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. 

మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన ఒకరు ఉండగా, గాయపడిన వారిలో జపాన్, డచ్ దేశాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ.. బస్సు అతివేగంగా వెళ్లడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు