/rtv/media/media_files/2025/02/27/hvu1TAV6vcbt2I5fcypa.jpg)
Israel Car Incident
ఇజ్రాయెల్ బస్‌స్టాప్‌లో ఉన్న జనంపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు కావాలనే జనాలపైకి తీసుకెళ్ళారు. అంతేకాదు కారులో ఉన్న వ్యక్తి పోలీసులపై కత్తితో దాడులకు కూడా పాల్పడినట్లు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌లోని హనా-కర్కూర్ జంక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే దీనిని ఉగ్రదాడేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్ పోలీసులు వెంటనే స్పందించారు. కారును అడ్డగించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించిన తర్వాతనే అన్ని విషయాలు తెలుస్తాయని భద్రతా సిబ్బంది చెబుతున్నారు.
అంతకు ముందు బస్సు పేలుళ్ళు..
ఇజ్రాయెల్ లో ఇలాంటి సంఘటనలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే అక్కడ వరుసపెట్టి బస్సు పేలుళ్ళు సంభవించాయి. దీంతో సెంట్రల్ ఇజ్రాయెల్ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆగి ఉన్న మూడు బస్సుల్లో ఒకేసారి బాంబులు పేలడం ఆందోళనకు దారితీసింది. ఇజ్రాయెల్ లోని బాట్ యామ్ సిటీలో ఈ సంఘటన జరిగింది. ఇవే కాక మరో రెండు బస్సుల్లో కూడా బాంబులున్నట్టు సమాచారం అందడంతో...బాంబ్ స్క్వాడ్ వాటిని నిర్వీర్యం చేసింది. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుళ్ళల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ దాడులకు పాల్పడింది పాలస్తీనా ఉగ్రవాదులేనని అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Blinkit: బ్లింకిట్ లో పది నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తులు