/rtv/media/media_files/2025/03/28/AsNtJ1PR5kvzDCwYI79N.jpg)
Mynmar Hospital
మయన్మార్ లో భూకంపం అక్కడి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా మీద వచ్చి పడిన విపత్తుతో జనం చెల్లాచెదురు అయిపోయారు. వేలల్లో ప్రాణాలు పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్ లో చాలా భవనాలు ఉన్న పళంగా నేలమట్టం అయ్యాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో ఇప్పటికే తెగ తిరుగుతున్నాయి.
వెయ్యి పడకల ఆసుపత్రి నేలమట్టం..
భూకంపం ధాటికి మయన్మార్ రాజధాని నేపిడాలో కొత్తగా నిర్మించిన ఓ ఆసుపత్రి మొత్తం నేలమట్టం అయింది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది వెయ్యి పడకల ఆసుపత్రి. మొత్తం భవనం కూలడంతో దీని కింద క్షతగాత్రులు ఎక్కువగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అలాగే ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి.
ఈరోజు మయన్మార్, బ్యాంకాక్ తో సహా చైనా, భారత్, వియత్నాం మరికొన్ని తూర్పు ఆసియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. అన్నిటి కంటే ఎక్కువగా థాయ్ లాండ్, మయన్మార్ దేశాలు ప్రభావితం అయ్యాయి. భారీగా ఇక్కడ భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మాండలే లో మసీదు కూలి దాదాపు 20 మంది చనిపోయారు. బ్యాంకాక్, మయన్మార్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో(Bangkok) భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది. భూ ప్రకంపనాల ధాటికి అనేక భవనాలు ఊగిపోయాయి. నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవనం కూలిన ఘటనలో 7 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 43 మంది కార్మికులు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
today-latest-news-in-telugu | earth-quake | Earthquake in Bangkok
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు