Interim Budget : మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు..!

మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్‌ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం.

New Update
Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్...ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది

Union Budget 2024 What to Expect : ఆర్థిక మంత్రి(Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కాసేపట్లో మధ్యంతర బడ్జెట్‌(Interim Budget) ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఈ బడ్జెట్‌ చాలా రకాలుగా ప్రత్యేకం. ఒకటి, ఆమె తన తొలి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటి వరకు ఆమె పూర్తి బడ్జెట్‌ను మాత్రమే సమర్పిస్తూ వచ్చారు. 10 ఏళ్ల నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వ హయాంలో ఇది రెండో మధ్యంతర బడ్జెట్. నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి?
ఎన్నికల ముందు బడ్జెట్‌లో ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్‌లోనూ ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ప్రధానమంత్రి కిసాన్‌ సాయం(PM Kisan Scheme) పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇంధన ధరలపై పన్నులను తగ్గిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. డిజిటల్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు ఉంటాయని టాక్‌. అటు ఎలక్ట్రిక్‌ వాహనాలపై రాయితీ గడువు పెంచే అవకాశాలున్నాయి. ఇంధన ధరలను తగ్గిస్తే నిత్యావసర వస్తువల ధరలు కూడా స్వల్పంగా తగ్గే ఛాన్స్‌ కనిపిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం. గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే ఛాన్స్‌ ఉంది. ఆయూష్మాన్‌ భారత్‌ పరిమితి రూ.7 లక్షలకు పెంచే అవకాశం ఉంది. బంగారు ఆభరణాల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయని తెలుస్తోంది.

2019 లాంటి సర్ ప్రైజ్ ఉంటుందా?

లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) ముందు మధ్యంతర బడ్జెట్‌లో అధికారంలో ఉన్న పార్టీకి ఉచితాలు, ప్రజాకర్షక పథకాల ద్వారా ఓటర్లను ఆకర్షించే పెద్ద అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇలాంటిదే కనిపించింది. 2019 మధ్యంతర బడ్జెట్‌లో, మధ్యతరగతి, రైతులు, అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేసింది. 2019 బడ్జెట్‌లో పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మధ్యతరగతి వర్గాలపై దృష్టి సారించిన ఆయన రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్నును మినహాయించారు. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించారు. దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా రూ.6000 నగదు సాయం అందజేస్తామని ప్రకటించారు. అసంఘటిత రంగం కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన ప్రారంభించారు. 50 కోట్ల మంది కార్మికులకు పదవీ విరమణ పెన్షన్‌ను ప్రతిపాదించారు. ఈ పథకం ప్రభుత్వానికి పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారింది.

Also Read: ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? మీకు తెలుసా?

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు