/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/04/10/s89TzYNPdyo6iR42Pnm0.jpg)
మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి. పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
కచ్చితంగా మార్చాల్సిందే..
పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Also Read: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
SA vs IND : ఆ ఒక్కడిపై ఆధారపడితే ఫలితాలు దక్కవు.. తొలి టెస్టు ఓటమిపై రోహిత్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బుమ్రా ఒక్కడిపై ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు అన్నారు.
SA vs IND : దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్(Rohith) శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ జట్టు విజయం కోసం ఏ ఒక్కరిపైనే ఆధారపడితే విజయాలు దక్కవని చెప్పారు.
ఈ మేరకు ‘దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. అయితే మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఇది 400 పరుగులు చేసే పిచ్ కాదు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ మేము బుమ్రాపైనే ఎక్కువ ఆధారపడితే ఫలితం అనుకున్నట్లు రాదు. అతనికి మిగతా బౌలర్లనుంచి మద్దతు కావాలి. మరో ముగ్గురు పేసర్లూ మరింత రాణించాల్సివుంది. నాణ్యమైన బౌలర్. ఈ ఓటమి నుంచి తప్పకుండా పాఠం నేర్చుకుంటాం. ఆటలో జయపాజయాలు కామన్. రెండో టెస్టుకు అన్ని రకాలుగా రెడీ అవుతున్నాం. గాయాల బాధ ఇబ్బంది పెడుతున్నప్పటికీ అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నాం. ప్రసిధ్ కృష్ణ ఇప్పుడే టెస్టుల్లోకి ఇప్పుడే అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో రాణిస్తాడనే నమ్మకం ఉంది. తన ఆటకు పదునుపెట్టాలి. దక్షిణాఫ్రికా జట్టులోనూ గెరాల్డ్, బర్గర్, జాన్‌సెన్ పేసర్లకు రెడ్‌బాల్ క్రికెట్ అనుభవం లేదు. అయినా పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని రాణించారు. అందుకే, ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమంగా రాణించేందుకు శ్రమించాలి. ఒక్కోసారి ఎంత శ్రమించినా తొలి మ్యాచ్‌లో నాణ్యమైన ప్రదర్శన చేయలేకపోవచ్చు. మేం కంగారు పడితే.. కొత్త బౌలర్ ఇంకా ఆందోళనకు గురవుతాడు. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అనుభవం సర్వసాధారణం' అన్నారు.
ఇది కూడా చదవండి : SKM : మోడీ సర్కార్ కు ‘ఎస్‌కేఎం’ షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్!
అలాగే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బ్యాటింగ్ దారుణంగా ఉందని, ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో కేఎల్ రాహుల్ చూపించాడని చెప్పాడు. ఇదిలావుంటే ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో సీజన్ పట్టికలోనూ దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోగా టీమ్‌ఇండియా ఐదో స్థానానికి పడిపోయింది.
🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
RGV : పోలీసులే భయపడితే.. హారర్ కామెడీ సినిమా చేస్తున్న.. ఆర్జీవీ సంచలన ప్రకటన
నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన Short News | Latest News In Telugu | సినిమా
భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ఉందంటే?
మూడు రోజుల కిందట రూ.3 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ పెరిగాయి. Short News | Latest News In Telugu | బిజినెస్
TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!
ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి
Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?
విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?
పొలంలో పాడుపని చేస్తూ భర్తకు దొరికిన భార్య...ప్రియుడితో కలిసి లేపేసింది!
🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
New Vehicle Rules: పాత వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు