Interim Budget : బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి! ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 01 Feb 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Interesting facts About Union Budget : సెంట్రల్ బడ్జెట్(Central Budget) కు టైమ్ దగ్గర పడింది. ఇవాళ(ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. మధ్యంతర బడ్జెట్(Interim Budget) అయినా కూడా సామాన్యులకు జాక్ పాట్ తగలనుందని ఏదో చిన్న ఆశ. మరి నిర్మలమ్మ(Nirmala Sitharaman) ఆ ఆశలను నిజాలు చేస్తుందా లేదా అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఈ లోపు బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముగ్గురు ప్రధానులు స్వయంగా బడ్జెట్‌ను సమర్పించారు: తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) తొలిసారిగా ప్రధాని హోదాలో 1958-1959 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. సాధారణంగా దేశ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పిస్తారు. పండిట్ నెహ్రూ కాకుండా, ఇందిరా గాంధీ(Indira Gandhi) ప్రధానమంత్రి హోదాలో 1970-71 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. దేశంలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కూడా ఆమె. ఆయన కుమారుడు రాజీవ్ గాంధీ కూడా ప్రధాని హోదాలో 1987-88 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు బడ్జెట్‌ను సమర్పించిన రికార్డు ఎవరిది? దేశ బడ్జెట్‌ను అత్యధిక సార్లు సమర్పించిన ఘనత మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌కే దక్కుతుంది. బడ్జెట్‌ను ఆయన మొత్తం 10 సార్లు సమర్పించారు. ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం 9 సార్లు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందిరాగాంధీ హయాంలోని ఈ బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' అని ఎందుకు పిలుస్తారు? 1973-74 సంవత్సరపు బడ్జెట్‌ను దేశంలోని 'బ్లాక్ బడ్జెట్'(Black Budget) అని పిలుస్తారు. దీన్ని అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌రావు చవాన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రూ.550 కోట్ల లోటు ఏర్పడింది. అప్పటి వరకు ఇదే అతిపెద్ద లోటు బడ్జెట్. ఈ బడ్జెట్ 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం, పేలవమైన రుతుపవనాల వల్ల ప్రభావితమైంది. 2000-01 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించారు. దీనిని దేశ 'మిలీనియం బడ్జెట్'గా పిలుస్తారు. ఇది 21వ శతాబ్దపు తొలి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు దేశంలోని ఐటీ రంగంలో విప్లవానికి దారితీశాయి. Also Read: ఈ బడ్జెట్ నుంచి ఆశించాల్సిన 6 కీలక అంశాలు ఇవే..!! WATCH: #union-budget-2024 #nirmala-sitharaman #interim-budget-2024 #2024-budget-expectations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి