Telangana : గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా రంజోల్ లోని గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల విద్యార్థిని ఆదివారం మిట్ట మధ్యాహ్నం హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటూ పేరెంట్స్ ఆందోళన చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Telangana : గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

Suicide : తెలంగాణ(Telangana) గురుకుల పాఠశాలలో మరో దారుణం జరిగింది. ఇప్పటికే పలువురు స్కూల్, కాలేజీ పిల్లల మరణాలు తల్లిదండ్రులను కలవరపెడుతుండగా.. మరో విద్యార్థిని ఆత్యహత్య(Suicide) చేసుకోవడం సంచలనంగా మారింది. తనతో చదువుతున్న స్నేహితులంతా మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లగా రూమ్ లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయిన ఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా జహీరాబాద్ రంజోల్ లోని రెసిడెన్సియల్ స్కూల్ లో చోటుచేసుకుంది.

బుక్స్ తెచ్చుకుంటానని చెప్పి.. 
ఈ మేరకు జహీరాబాద్‌ ఎస్సై ప్రసాద్‌రావు, ప్రిన్సిపల్‌ క్రిష్ణవేణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్‌ మండలం తూంకుంట గ్రామానికి చెందిన బ్యాగరి రాజు, వనజ దంపతుల కుమార్తె స్వప్న(Swapna) (17) రంజోల్‌ గురుకుల పాఠశాలలో ఇంటర్‌(Inter) మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ వెలువడటంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయలు.

కిటికీలోనుంచి చూసి..
అయితే ఆదివారం మధ్యాహ్న భోజనం తర్వాత రూమ్ లో బుక్స్ తెచ్చుకుంటానని హాస్టల్‌ గదికి వెళ్లింది. చాలాసేపు బయటకు రాలేదు. ఈ క్రమంలోనే మరో విద్యార్థిని కిటికీలోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే విషయం గమనించిన స్కూల్ సిబ్బంది ఆమెను జహీరాబాద్‌(Zaheerabad) ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

ఇది కూడా చదవండి : CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు

స్కూల్ ముందు పేరెంట్స్ ఆందోళన..
ఇక చదువుతోపాటు ఆటపాటల్లో చురుగ్గా ఉండే తమ కూతురు ఆత్మహత్య వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఏదో జరిగివుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తూంకుంట గ్రామస్థులు, రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు గురుకులానికి తరలివచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరా తీసి జహీరాబాద్‌ ఆర్డీవో వెంకారెడ్డి, గురుకుల అధికారులతో చర్చించి పరిహారంతోపాటు కుటుంబ సభ్యులకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు