భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్‌ బ్రిడ్జి ఫ్లైఓవర్

విశాలమైన రోడ్లతో, ప్లై ఓవర్ బ్రిడ్జీలతో హైదరాబాద్‌ మహానగరం దినాదినాభివృద్ధి చెందుతుంది. అలా నగర సిగలో ఎన్నో కట్టడాలు అబ్బురపరుస్తున్నాయి. ఓ పక్క నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్, మరోపక్క అంబేద్కర్‌ విగ్రహం. తాజాగా ఇదే కోవలోకి మరో మణిహారం అయినటువంటి ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనుంది.

New Update
భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్‌ బ్రిడ్జి ఫ్లైఓవర్

భాగ్యనగరంలో వాహనదారులకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నో ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు జరిగాయి. అయితే ఇందిరా పార్క్ - విఎస్‌టి మధ్య ఉక్కు ఫ్లైఓవర్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రజల చిరకాల కోరిక తీరనుంది. అందులో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకమని చెప్పాలి. దీని వ్యయం రూ.450 కోట్లు. 2.6 కిలోమీటర్ల మేర నిర్మించిన అతిపెద్ద ఉక్కు వంతెన ఇది. ఈ వంతెన పనులు ఇటీవల పూర్తికావడంతో లోడ్‌ టెస్టు నిర్వహిస్తున్నారు. లోడ్‌ టెస్ట్‌ పూర్తి కాగానే ఈ నిర్మాణం నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది.

లోడ్‌ టెస్ట్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అందుబాటులోకి

అంతేకాదు ఈ నిర్మాణం హైదరాబాద్‌ నగరానికే తలమానికంగా మారనుంది. అయితే లోడ్‌ టెస్ట్ ప్రక్రియ పూర్తయిన అనంతరం వచ్చే పది రోజుల్లోగా బ్రిడ్జిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఎన్టీఆర్‌ జంక్షన్‌, అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, బాగ్‌లింగంపల్లి జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ నుంచి ప్రయాణికులకు కొంత ట్రాఫిక్ ఉపశమనం లభిస్తుంది. ఈ నిర్మాణం కోసం 12,500 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ని వాడుతున్నారు.

స్టీల్‌ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే:

ప్రాజెక్టు స్వరూపం : రూ. 450 కోట్లు
పొడవు : 2.62 కి.మీ
వెడల్పు : నాలుగు లేన్లు
స్టీల్‌ పిల్లర్లు : 81
ఉక్కు గిడ్డర్లు : 426
కాంక్రీట్‌ వాడకం : 20వేల క్యూబిక్‌ మీటర్లు

ఈ నిర్మాణంతో ట్రాఫిక్‌కు చెక్‌

Bridge construction to be made available

ఈ నిర్మాణం ఈరోజు (ఆగస్టు 15) నాటికి పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సుమారు 12500 టన్నుల స్టీల్ 450 కోట్ల రూపాయలతో నిర్మించబడింది, ఈ ఫ్లై ఓవర్. నాలుగు లేన్‌లతో కూడిన ఈ వంతెన తెలంగాణ ప్రభుత్వ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నిర్మించబడుతున్నది. ఇది దిశాత్మక ఎలివేటెడ్ కారిడార్. ఇందిరా పార్క్ - VST జంక్షన్, మలక్‌పేట, పంజాగుట్ట వద్ద ఉన్న రెండు నిర్మాణాల తర్వాత ఇది నగరంలో ఐదవ స్టీల్ బ్రిడ్జిగా సెట్ చేయబడింది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత, విఎస్‌టి జంక్షన్, ఇందిరా పార్క్ ఎక్స్-రోడ్ మరియు ఆర్‌టిసి ఎక్స్-రోడ్‌లలో రద్దీగా ఉండే మూడు జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

కొన్ని కారణాల వల్ల ఆలస్యం

ఈ జంక్షన్‌లన్నీ వాటి చుట్టూ నివాసం ఉండే వారితో వాణిజ్య సంస్థలతో కేంద్రీకృతమై ఉన్నందున భారీగా ట్రాఫిక్‌ సమస్య ఉండేది. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బాగ్ లింగంపల్లి జంక్షన్, అశోక్ నగర్ ఎక్స్-రోడ్‌లలో ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గనుంది. అయితే ఈ ఫ్లై ఓవర్‌కు సంబంధించిన పనులను డిసెంబర్ 2022 నాటికి పూర్తి చేయాలని పౌర సంఘం మొదట ప్రణాళిక వేసింది. అయితే ఆ సమయంలో వర్షాలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్కు సరఫరా తగ్గడం వల్ల పనులకు అంతరాయం ఏర్పడి నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment
Advertisment