Indigo Flight : గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌..ఎందుకంటే!

ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్యాసింజర్లు ఉననారు. వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. అయితే పక్షి ఢీకొట్టడంతో ప్లైట్ లెఫ్ట్ ఇంజిన్ లో సమస్య తలెత్తింది. ప్రయాణికులకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని విమానాశ్రయాధికారులు తెలిపారు

New Update
Indigo Flight : గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌..ఎందుకంటే!

Indigo Flight Emergency Landing: భువనేశ్వర్‌ (Bhuvaneswar) నుంచి ఢిల్లీ(Delhi) కి బయల్దేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో పైలెట్ విమానాన్ని మళ్లీ తిరిగి భువనేశ్వర్‌ విమానాశ్రయానికి మళ్లించాడు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో 6E2065 విమానం సోమవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన 25 నిమిషాల తరువాత విమానాన్ని పక్షి(Bird) ఢీకొట్టింది.

దీంతో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. విమానాశ్రయాధికారులకు సమాచారం అందించడంతో వారు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్యాసింజర్లు ఉననారు.

వారంతా కూడా క్షేమంగానే ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. అయితే పక్షి ఢీకొట్టడంతో ప్లైట్ లెఫ్ట్ ఇంజిన్ లో సమస్య తలెత్తింది. ప్రయాణికులకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని విమానాశ్రయాధికారులు తెలిపారు.

15 రోజుల ముందు కూడా ఇండిగో విమానం నాగపూర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యంది. ముంబై నుంచి రాంచీకి వెళ్తున్న క్రమంలో ఓ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకోవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Also Read: లారీ ఎక్కిన విమానం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

Advertisment
Advertisment
తాజా కథనాలు