Indian Railways : రైలులో ప్రయాణికుల రద్దీ వీడియో వైరల్.. స్పందించిన రైల్వేశాఖ ఏప్రిల్ 14న ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఆ రైల్లో ప్రయాణించిన ఓ వ్యక్తి షేర్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వేశాఖ మరో వీడియోను షేర్ చేసింది. తప్పుడు వీడియోలు షేర్ చేయొద్దంటూ హెచ్చరించింది. By B Aravind 21 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Video Viral : భారత రైల్వే(Indian Railways) ల్లో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. కొన్నిసార్లు రైళ్లు ప్రయాణికులతో(Train Passengers) కిక్కిరిసిపోతాయి. అయితే ఏప్రిల్ 14న ముంబయి నుంచి ఉత్తర్‌ప్రదేశ్ మధ్య నడిచే ఓ రైలుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతోంది. అందులో చూస్తే ఆ ట్రైన్‌లో కనీసం బాత్‌రూంకు కూడా వెళ్లకుండా ప్రయాణికులు రద్దీ ఉంది. ఎంట్రీ, ఎగ్జీట్ డోర్ల వద్ద కూడా ప్రయాణికులు నిల్చున్నారు. Also read: మణిపూర్‌లో మళ్లీ రీపోలింగ్.. ఎందుకంటే ఇలా ఆ రైలులో విపరీతంగా ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఓ ప్రయాణికుడు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) కు ట్యాగ్ చేసి ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశాడు. ' ఇది జనరల్ కోచ్ కాదు. స్లీపర్ కోచ్ కాదు. 3వ ఏపీ కోచ్ కాదు. ఇది 2వ ఏసీ కోచ్. భారతీయ రైళ్లలో అత్యంత ప్రీమియం కోచ్‌కు ప్రయాణికుల గుంపు చేరుకుంది. ఒకటవ ఏపీ మాత్రమే ధ్వంసం చేయడానికి మిగిలి ఉందని' పేర్కొన్నాడు. This is not a General Coach This is not a Sleeper Coach This is not a 3AC Coach This is a 2nd AC Coach!! The crowd has reached one of the most premium coaches of Indian Trains. Only First AC is left to be destroyed by @AshwiniVaishnaw pic.twitter.com/qyByUevhUd — Kapil (@kapsology) April 19, 2024 ఈ వీడియో వైరల్ కావడంతో కేంద్ర రైల్వేశాఖ దీనిపై స్పందించింది. ఎలాంటి ప్రయాణికుల రద్దీ లేని ఓ వీడియోను షేర్ చేసింది. ' ఇది ప్రస్తుతం ఆ రైలుకి సంబంధించిన వీడియో. అక్కడ ఎలాంటి ప్రయాణికుల రద్దీ లేదు. ఇలాంటి తప్పుడు వీడియోలు షేర్ చేసి భారత రైల్వే ప్రతిష్ఠను దిగజార్చవద్దు అంటూ హెచ్చరించింది. అయితే దీనిపై కూడా ఆ యూజర్ స్పందించారు. ఏప్రిల్ 14న జరిగిన సంఘటన కాకుండా ఇప్పటి వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసిందని అన్నారు. మీ బెదింపులు.. భారత రైల్వేశాఖ అందిస్తున్న నాణ్యత లేని సేవలను బహిర్గతం చేయకుండా భారతీయులను ఆపలేవంటూ బదులిచ్చాడు. The present video of the coach. No overcrowding. Please don't malign the image of Indian Railways by sharing misleading videos. https://t.co/70xQkhRVdT pic.twitter.com/ivz9LDyFly — Ministry of Railways (@RailMinIndia) April 20, 2024 Also Read: కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త #telugu-news #national-news #indian-railways మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి