USA: యూపీకి చెందిన సచిన్ సాహూను కాల్చిన అమెరికా పోలీసులు

అమెరికాలోని శాన్ ఆంటోనియోలో ఒక మహిళను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించడమే కాక అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను సైతం కారుతో ఢీకొట్టాలని చూసిన భారతీయుడిని అమెరికన్ పోలీసులు కాల్చి చంపారు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహూగా గుర్తించారు.

New Update
USA: యూపీకి చెందిన సచిన్ సాహూను కాల్చిన అమెరికా పోలీసులు

Indian origin Sachin Sahoo: సచిన్ సాహూ..ఉత్తరప్రదేశ్‌కుచెందిన వ్యక్తి. 42ఏళ్ళ సచిన్ సాహూ ఎప్పటి నుంచో అమెరికాలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం అతను టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో ఉంటున్నాడు. ఇతని వయసు 42 ఏళ్ళు. రీసెంట్‌గా సచిన్ తన రూమ్ మేట్ అయిన 51 ఏళ్ళ మహిళను కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్నారు. ఆమెకు సర్జరీలు జరుగుతున్నాయి. పరిస్థతి విషమంగా ఉంది.

ఈ యాక్సిడెంట్ కేసులో సచిన్ సాహూ మీద కేసు నమోదు చేశారు శాన్ ఆంటోనియో పోలీసులు. అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో సచిన్ బాధితురాలిని యాక్సిడెంట్ చేసిన ప్లేస్‌లోనే మళ్ళీ సంచరిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్ళారు. కానీ సాహూ పోలీసుల మీద కూడా తిరగబడ్డాడు. పట్టుకోవడానికి వచ్చిన ఇద్దరినీ కారుతో ఢీకొట్టాడు. ఇందులో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు కూడా. దీంతో మరో పోలీస్ అధికారి సచిన్ మీద తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడిక్కడే మరణించాడు.

సచిన్ సాహూ అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సచిన్ గత కొన్నేళ్ళుగా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అతని మాజీ భార్య లీ గోల్డ్ స్టీన్ తెలిపింది. అలాగే స్క్రిజోఫ్రీనియా సమస్యతో చికిత్స తీసుకుంటున్నాడని, బహుశా మందులు వాడటం మానేసి ఉంటాడని అనుమానం వ్యరక్తం చేసింది. సచిన్‌కు పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు.

Also Read:Whats App: అలా అయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం..వాట్సాప్

Advertisment
Advertisment
తాజా కథనాలు