International:ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణం చేసిన సెనేటర్ విదేశాల్లో భారత ఘనత మరో సారి పరిమళించింది. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందో ఘటన. సెనేటర్‌గా ఎంపిక అయిన భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేశారు. By Manogna alamuru 07 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Indian origin elected as Astralia senator:ఆస్ట్రేలియన్‌లో భారతీయుడు చరిత్ర సృస్టించాడు. పార్లమెంటులో సెనేటర్‌గా భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేసిన మొదటి సభ్యుడిగా నిలిచారు. ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో ఆస్ట్రేలియా రాష్టానికి ప్రతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్టేలివ్ కూన్సిల్ వరుణ్‌ను ఎన్నుకొన్నాయి. ఇతను పశ్చి ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. పెర్త్ లో నివాసం ఉంటున్నారు. Welcome to Varun Ghosh, our newest Senator from Western Australia. Senator Ghosh is the first ever Australian Senator sworn in on the Bhagavad Gita. I have often said, when you're the first at something, you've got to make sure you're not the last. pic.twitter.com/kTLUZsx0iX — Senator Penny Wong (@SenatorWong) February 6, 2024 ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పోస్ట్.. వరుణ్ ఘోష్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత...ఆ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం...భగవద్గీత మీద ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ ఇతనే అని అందులో రాసారు. సేనేటర్ ఘోష్ తన కమ్యునీటికి, వెస్ట్ ఆస్ట్రేలియన్లకు బలమైన గొంతుకగా మారతారని ఆశిస్తున్నా అంటూ విషెస్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా వరుణ్‌కు స్వాగం పలికారు. వరుణ్ న్యాయవాది.. భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నివాసం ఉంటున్నారు. ఇతను వృత్తి రిత్యా న్యాయవాది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ అండ్ లా లో డిగ్రీ తీసుకున్నారు. వరుణ్ గతంలో న్యూయార్క్‌లో అటార్నీగా, వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకుకు సలహాదారుడిగా కూడా పని చేశారు. వరుణ్ ఘోష్ పెర్త్ లోని లేబర్ పార్టీలో జాయిన్ అవడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇక సెనేటర్‌గా ఎన్నికవ్వడం మీద వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్న ప్రమాణాలతో విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. Also Read:Telangana : 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు #australia #indian-origin #senator #bhagavd-geeta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి