Paris Olympics 2024 : ఒలింపిక్స్ కోసం 417 కోట్లు ఖర్చు.. ఒలింపిక్స్‌ను ప్రతీ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీని కోసం క్రీడాకారులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇండియా కూడా ఒలింపిక్ కోసం ప్రతీసారి కోట్లు ఖర్చు పెడుతుంది. ఈసారి పారిస్‌లో జరుగుతున్న ఈ విశ్వ పోటీలకు భారత ప్రభుత్వం 417 కోట్లను ఖర్చు చేసింది. By Manogna alamuru 26 Jul 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Olympics Investment : ఈరోజు పారిస్‌లో ఒలిపింక్స్ (Paris Olympics 2024) పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భారతదేశం నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 7 పతకాలు సాధించింది. దింతో మరోసారి భారత జట్టు పతకాలు పెంచుకోవాలని భావిస్తోంది. దీని కోసం భారత ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు పెట్టింది. ఒలింపిక్స్ సన్నాహకాల కోసం మొత్తం రూ.417 కోట్లను ఖర్చు పెట్టింది. పారిస్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ కేటగిరీలో అత్యధికంగా 29 మంది ఆటగాళ్లను భారత్ పంపించింది. వీరి కోసం భారత ప్రభుత్వం (Indian Government) రూ. 96.08 కోట్లు ఖర్చు చేసింది. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్ ఇప్పటివరకు కేవలం 3 పతకాలు మాత్రమే సాధించింది. లాస్ట్ ఒలిపింక్స్‌లో జావెలన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. దీని తర్వాత బ్యాడ్మింటన్ కోసం 72.02 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈసారి బ్యాడ్మింటన్‌లో భారత్ నుంచి మొత్తం 7 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో ఈ గేమ్ లో భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. పీవీ సింధు (PV Sindhu) టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించింది. అంతకు ముందు సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ 2012లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఇక బాక్సింగ్‌లో రూ.60.93 కోట్లు, షూటింగ్‌లో రూ.60.42 కోట్లు ఖర్చు వెచ్చించింది ప్రభుత్వం. ఒలింపిక్ చరిత్రలో బాక్సింగ్ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 3 పతకాలు సాధించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ , 2020లో లోవ్లినా బోర్గోహైన్ కాంస్య పతకాలు సాధించారు. ఒలింపిక్స్ షూటింగ్‌లో భారత్ కు మంచి రికార్డ్సే ఉన్నాయి. ఇందులో మొత్తం 4 పతకాలు సాధించింది. ఇందులో అభినవ్ బింద్రా స్వర్ణం కూడా ఉంది. అలాగే హాకీకి రూ.41.29 కోట్లు, ఆర్చరీకి రూ.39.18 కోట్లు, రెజ్లింగ్‌కు రూ.37.80 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్ చరిత్రలో భారత్ హాకీలో మొత్తం 12 పతకాలు సాధించగా.. అందులో 8 బంగారు పతకాలు ఉన్నాయి. అదుకే భారత్ కు హాకీ జాతీయ క్రీడ కూడా అయింది. మరోవైపు వెయిట్ లిఫ్టింగ్ కోసం ఈ సారి భారత్ రూ.26.98 కోట్లు ఇచ్చింది. ఒలింపిక్స్‌లో ఈ క్రీడలో భారత్ మొత్తం 2 పతకాలు సాధించింది. 2000లో కరణం మల్లీశ్వరి కాంస్యం, 2020లో మీరాబాయి చాను రజతం గెలుచుకున్నారు. దీంతో పాటు టేబుల్ టెన్నిస్‌పై రూ.12.92 కోట్లు, జూడోపై రూ.6.30 కోట్లు, స్విమ్మింగ్ పై రూ.3.90 కోట్లు, రోయింగ్ పై రూ.3.89 కోట్లు, సెయిలింగ్ పై రూ.3.78 కోట్లు, గోల్ఫ్ పై రూ.1.74 కోట్లు, టెన్నిస్ పై రూ.1.67 కోట్లు, గుర్రపు స్వారీపై 0.95 కోట్లు వెచ్చించింది. Also Read:Telangana: తనికెళ్లకు ఎస్ఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ #2024-paris-olympics #investment #indian-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి