Pakistan Spy : రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి..

రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్‌కి చెందిన 'ఇంటర్ సర్వీస్‌ ఇంటిలిజెన్స్‌' ( ISI ) తన గూఢచారిని నియమించినట్లు తెలిసింది. దీంతో యూపీకి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడ్ని మీరట్‌కు పిలిపించి అరెస్టు చేసింది.

New Update
Pakistan Spy : రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి..

India - Russia : భారత్ - రష్యా(India-Russia) ల మధ్య జరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్(Pakistan) నిఘా పెట్టింది. ఇందుకోసం ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలోకి పాకిస్థాన్‌కి చెందిన 'ఇంటర్ సర్వీస్‌ ఇంటిలిజెన్స్‌' (ISI) తన గూఢచారిని నియమించింది. తాజాగా అతడ్ని ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh) లోని మీరట్‌లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్.. అదుపులోకి తీసుకుంది. నిందితుడ్ని సతేందర్‌ సివాల్‌గా గుర్తించింది. అయితే అతడు విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు.

భారత్‌కు ముప్పు

అయితే భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్‌ఐ చొరబడ్డట్లు రహస్య సమాచారం అందింది. దీంతో ఏటీఎస్‌(ATS) అప్రమత్తమైంది. అతడు ఇండియన్ ఆర్మీ(Indian Army) కి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని.. ఇందుకు ప్రతిగా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ సమాచారం భారత్‌కు భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు భావించారు.

Also Read :  ” భారత్‌ మాతా కి జై” అని గట్టిగా అనండి.. అనడం లేదని మంత్రి ఫైర్‌!

హోదాను అడ్డుపెట్టుకుని

చివరికి సతేందర్‌ను హాపూర్ జిల్లా షమహిద్దుయూన్‌పుర్‌గా గుర్తించారు. అతడు మాస్కో(Masco) కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్ట్‌ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్థాన్‌ స్పై నెట్‌వర్క్‌(Spy Network) లో అతడు ఓ కీలక వ్యక్తని అధికారులు అంటున్నారు. సతేందర్ తన హోదాను అడ్డుపెట్టుకొని కీలకమైన పత్రాలు సంపాదించాడు. అయితే వీటిల్లో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి.

అయితే ఈ క్రమంలోనే అతడు కొందరు భారత అధికారులకు లంచాలను కూడా ఆశ చూపాడు. ఈ సమాచారాన్ని సతేందర్ పాకిస్థాన్‌లో ఉన్న ఐఎస్‌ఐ ప్రతినిధులకు కూడా చేరవేశాడు. అతడి కదలికలపై నిఘా పెట్టిన తర్వాత ఏటీఎస్ అధికారులు అతడ్ని మీరట్‌కు పిలిపించారు. వారు అడిగిన ప్రశ్నలకు సతేందర్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదు. చివరికి అతడు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

Also Read :  నమీబియా దేశాధ్యక్షుడు గింగోబ్‌ కన్నుమూత!

Advertisment
Advertisment
తాజా కథనాలు