Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.

ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో భాగంగా ఈరోజు విశాఖలో ఇండియా-ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాలో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో జడేజా, రాహుల్ దూరం అవగా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు.

New Update
Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.

India Vs England Second Test: ఇండియా వేదికగా మనకు, ఇంగ్లాండ్‌కు మధ్య టెస్ట్ సీరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో మనవాళ్ళు బాగానే ఆడినా చివరలో పట్టు కోల్పోవడంతో ఇంగ్లాండ్ వాళ్ళు విజయం సాధించారు. ఇక ఈరోజు విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో గాయాలు పాలయిన రవీంద్ర జడేజా, కే.ఎల్.రాహుల్‌లు ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. ఇక బౌలర్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లో ముఖేష్, కుల్దీప్‌లు చోటు దక్కించుకున్నారు. వారితో పాటూ యంగ్ క్రికెటర్ రజత్ పాటిదార్ టెస్ట్‌ల్లో అరగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ టీమ్‌లోనూ రెండు మార్పుల జరిగాయి. జాక్ లీచ్, మార్క వుడ్ స్థానంలో షోయబ్ బషీర్, జేమ్స్ అండర్స్ వచ్చారు.

Also Read: Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు

మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్..
మొదటి మ్యాచ్‌లో ఒడిపోయిన టీమ్ ఇండియా ఈ రెండవ దానిలో పుంజుకుని గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో గెలిస్తే రెండు టీమ్‌లూ చెరో పాయింట్‌తో సమానంగా ఉంటారు. అలా కాకుండా ఇందులో కూడా ఇంగ్లాండే గెలిస్తే ఆ టీమ్ ఆధిక్యంలోకి వెళ్ళిపోతుంది. అందుకే వారిని ఎలా అయినా కట్టడి చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. విశాఖలోని (Visakhapatnam) వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి రికార్డ్ ఉంది. అలాగే 2016లో ఇదే గ్రౌండ్‌లో భారత్-ఇంగ్లాండ్‌లు తలపడగా 246 పరుగులతో టీమ్ ఇండియా విజయం సాధించింది.

తుది జట్లు...
భారత్ (India) : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్

ఇంగ్లండ్ (England) : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment