IND vs WI: ఇదే కద భయ్యా మాకు కావాల్సింది.. విండీస్ తుక్కు రేగొట్టారుగా! విండీస్‌పై నాలుగో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. ఓపెనర్లు వీరవిహారం చేసిన ఈ మ్యాచ్‌లో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయ్యింది టీమిండియా. శుభ్‌మాన్ గిల్(77), యశస్వి జైస్వాల్(84 నాటౌట్) చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ మ్యాచ్ విక్టరీతో సిరీస్ 2-2తో సమం అయ్యింది. ఇక చివరిదైన ఐదో టీ20 ఇవాళ (ఆగస్టు 13) ఫ్లోరిడా వేదికగా భారత్ కాలమానం ప్రకారం 8గంటలకు ప్రారంభమవుతుంది. By Trinath 13 Aug 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి India vs West Indies Highlights: ఏవో రెండు మ్యాచ్‌లు పోనిలే అని దేవుడికి ఇచ్చేశాం.. అప్పటికే వన్డేలు, సిరీస్‌లు ఓడిపోయి ఉన్న జట్టుపై ప్రతాపం ఎందుకులే అని లైట్ తీసుకున్నాం.. అలాగని మా యువ జట్టు సత్తాని తక్కువ అంచనా వేస్తారా? విమర్శకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతారా? ఇప్పుడు అర్థమైందా.? సిరీస్ సమం చేసి పడేశాం. ఇవాళ (ఆగస్టు 13) డిసైడర్ మ్యాచ్‌లోనూ ఇదే రిపీట్ అవుతుంది.. సిరీస్ గెలిచేస్తాం.. ఇది ప్రస్తుతం టీమిండియా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ మనసులో మాటలు. తొలి రెండు టీ20ల్లో ఓడిపోయినా.. తర్వాత జరిగే ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అని తెలిసినా.. ఏ మాత్రం వణకని పాండ్యా(pandya) సేన.. నాలుగో టీ20లో విండీస్‌ని చిత్తు చేసింది. సిరీస్‌ని 2-2తో సమం చేసింది. ఇక ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ ఫ్లోరిడా(florida) వేదికగా జరుగనుంది. ఛేజింగ్‌లో చింపేశారు బ్రో: 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా(team india).. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ని ఫినిష్ చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును మట్టికరిపించింది. చిచ్చరపిడుగు యశస్వి జైస్వాల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లోనే 84పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో 3సిక్సర్లు 11 ఫోర్లు ఉన్నాయి. అటు విండీస్ గడ్డపై అట్టర్‌ఫ్లాప్ అవుతూ వస్తున్న శుభ్‌మన్ గిల్ చెలరేగి బ్యాటింగ్ చేశారు. విమర్శకులకు సమాధానం ఇస్తూ 47 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరి ఓపెనర్ల ధాటికి టీమిండియా విక్టరీ ముందే కన్ఫమ్ ఐపోయింది. మ్యాచ్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో గిల్ అవుట్ అవ్వగా.. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ గెలుపు లాంఛానాన్ని పూర్తి చేశాడు. హెట్‌మైర్ హిట్.. కానీ ప్చ్: మొదటి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మైర్ హాఫ్ సెంచరీ బాదాడు. 39 బంతుల్లో 61 రన్స్ చేశాడు. ఇందులో 4 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అటు షై హోప్ 29 బంతుల్లో 45 రన్స్ చేశాడు. మిగిలిన వారిలో ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లతో రాణించాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్ల తీశాడు. 6.50 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. ఇక చివరిదైన ఐదో వన్డే ఇవాళ జరగనుండగా.. సిరీస్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. తుది జట్లు భారత్: యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పోవెల్, షిమ్రాన్ హిట్‌మెయర్, జేసన్ హోల్డర్, రొమారియో షెఫర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హుసేన్, ఒబే మెకాయ్ #yashasvi-jaiswal #shubman-gill #india-vs-west-indies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి