WTC Table: కొంపముంచిన హైదరాబాద్‌ ఓటమి.. బంగ్లాదేశ్‌ కంటే కిందకి పడిపోయిన ర్యాంక్!

హైదరాబాద్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై ఓడిపోయిన భారత్‌ WTC టేబుల్‌లో కిందకు పడిపోయింది. ప్రస్తుతం 5వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. WTC స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ముందున్నాయి. ఈ WTC సైకిల్‌లో భారత్‌ 5 మ్యాచ్‌ల్లో 2గెలుపు, 2 ఓటమి, ఒక డ్రా చేసుకుంది.

New Update
WTC Table: కొంపముంచిన హైదరాబాద్‌ ఓటమి.. బంగ్లాదేశ్‌ కంటే కిందకి పడిపోయిన ర్యాంక్!

WTC Points Table: ఒక్క ఓటమితో అంతా తారుమారు అవుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ సైకిల్‌లో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమే. గత రెండుసార్లు కూడా టీమిండియా WTCలో ఫైనల్‌ వరకు వచ్చింది. ఫైనల్‌లో ఓడిపోయింది. ఇక మూడో సైకిల్‌లో టీమిండియా ఆట కలవర పెడుతోంది. మొన్న సౌతాఫ్రికా టూర్‌లో ఒక మ్యాచ్‌ ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్‌ డ్రా చేసుకుంది. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో ఓడిపోయింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 28 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది.


దిగజారిన ర్యాంక్:
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ తాజా WTC ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే దిగువకు పడిపోయింది. జనవరి 28, ఆదివారం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన సిరీస్‌లోని ప్రారంభ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ భారత్‌పై ఘన విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా WTC పాయింట్ల పట్టికలో భారత్ ర్యాంక్‌ పడిపోయింది ప్రస్తుతం 5వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. WTC స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా అందరికంటే ముందుంది, తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో టీమిండియా ఉంది.


ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భారత జట్టు 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచింది.. మరో రెండు ఓడిపోయింది. ఒక గేమ్‌ను డ్రా చేసుకుంది. వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలో ఒక్కో టెస్టు మ్యాచ్‌ గెలిచిన భారత్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది.

Also Read: ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌.. యానిమల్‌కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ పంట!

Advertisment
Advertisment
తాజా కథనాలు