IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు! ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By Trinath 23 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023: ఉదయమంతా ఉక్కపోతను తలపించే సాధారణ ఎండ.. సాయంత్రం అవ్వగానే చల్లబడే వాతావారణం.. చుట్టూ చెట్లు.. సముద్రం.. చల్లచల్లని గాలి.. ఆహ్లాదం.. వినోదం.. పార్కులు, కొండలు.. గుట్టలు.. యువత కేరింతలు.. చప్పట్లు.. అబ్బా.. విశాఖలో మ్యాచ్ అంటే ఆ ఆనందమే వేరు. అది కూడా సంధ్యవేళ 7గంటలకు మ్యాచ్ అంటే.. అహా.. తలుచుకుంటేనే స్వర్గంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం సాగరతీర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి ఫైట్‌కు రెడీ: వరల్డ్‌కప్‌లో విశాఖ స్టేడియానికి హోస్టింగ్ రాకపోవడం అక్కడి క్రికెట్ లవర్స్‌ను నిరాశకు గురి చేసింది. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్రౌండ్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగలేదు. అయితే వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే నాలుగో రోజు(ఇవాళ) ఈ స్టేడియం పొట్టి సమరానికి సిద్ధమైంది. వన్డే వరల్డ్‌కప్ విశ్వవిజేత ఆస్ట్రేలియాను రన్నర్ అప్ ఇండియా ఫేస్ చేయనుంది. దీంతో సొంత టీమ్‌ను సపోర్ట్ చేసేందుకు విశాఖ అభిమానులు స్టేడియానికి క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం మినీ సైజ్ యుద్ధమే జరిగింది. షెడ్యూల్స్ మార్చుకున్నారు బాసూ: వారం రోజులుగా ఇవాళ్టి(నవంబర్ 23) మ్యాచ్ కోసం విశాఖ క్రికెట్ అభిమానులు కళ్లలో ఒత్తులేసుకోని వెయిట్ చేస్తున్నారు. తమ అభిమాన టీమ్ ఆటను ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మ్యాచ్‌కు టికెట్లు తీసుకున్నా వాళ్లు..తీసుకోని వాళ్లు.. అంతా తమ షెడ్యూల్స్‌ను మార్చుకున్నారు. టికెట్ దొరకకున్నా ఏం అవుతుంది.. ఇంట్లో కూర్చొని పిల్లలతో మ్యాచ్ ఎంజాయ్ చేయవచ్చని తమ పనులను పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మవైపే అందరిచూపు నెలకొంది. అటు ఆస్ట్రేలియా టీమ్‌లో మ్యాక్స్‌వెల్ విన్యాసాలు కూడా చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అసలైనా క్రికెట్ మజా కావాలని.. చివరకు మాత్రం ఇండియానే గెలవాలని కోరుకుంటున్నారు. ఇండియా ప్లేయింగ్ XI(అంచనా): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ముఖేష్ కుమార్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI(అంచనా) మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్, కేన్ రిచర్డ్‌సన్/సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా Also Read: అతి జాగ్రత్తే కొంపముంచింది.. ఇండియా చేసిన ఐదు తప్పిదాలివే! WATCH: #visakhapatnam #cricket #vizag #india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి