canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత...

కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్  ప్రకటించింది.

New Update
canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత...

ఖలిస్తాన్ నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ తో భారత ఏజెంట్లకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఆరోపణలు చేయడంతో భారత్, కెనడా దేశాల మధ్య చిచ్చు రాజుకుంది. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించారు. ప్రపంచ దేశాలు ఈ ఇష్యూ మీద ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలన్నీ భారత్ కే మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా-కెనడాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం కెనడియన్ పౌరులకు భారత వీసాలను మంజూరు చేయరు. తదుపరి నోటీసులు వచ్చేవకు వీసాలను ఇవ్వమని చెబుతోంది. భారతదేశం ఇంకా ఇతర దేశాల నుండి దరఖాస్తులను నిర్వహించే BLS ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రం వెబ్ సైటులో ఈ సందేశాన్ని పోస్ట్ చేసింది. 21 సెప్టెంబర్ 2023 నుండి ఈ నోటీసు అమలులోకి వస్తుందని తెలిపింది. మళ్ళీ ఎప్పుడు దరఖాస్తును స్వీకరించేది తెలియాలంటే BLS వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి అని తెలిపింది. అయితే వీసాల సస్పెన్షన్‌కు భారత్-కెనడా ఘర్షణకు లింక్ ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

India Suspends Visa Operations in Canada Indefinitely

ఈ నెల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భారత ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగించడం పట్ల ఆందోళనను ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. దీని తర్వాతనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో భారత ఏజెంట్ల మీద ఆరోపణలు చేశారు.
సుఖా దునేకే ను మేమే చంపాం-గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్..

మరోవైపు కెనడాలో ఖలిస్తానీ సపోర్టర్ సుఖా దునెకే హతమార్చడం వెనుక తాము ఉన్నామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనౌన్స్ చేశాడు. సుఖా దునేకే ఖలాస్తానీ మూవ్ మెంట్ లో కీలకంగా పని చేశాడు. కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్‌ను హతమార్చామని చెప్పారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచి ఈ ప్రకటనను విడుదల చేశాడు. గుర్ లాల్ బరార్, విక్కీ మిద్దుఖేరా గ్యాంగ్ స్టర్ ల హత్యలకు సుఖా కీ రోల్ పోషించాడని బిష్ఱోయ్ చెప్పాడు. దునెకే డ్రగ్ అడిక్ట్ అని, అతను చేసిన పాపాలకు శిక్షగానే అతణ్ణి చంపామని బిష్ణోయ్ తెలిపాడు. తమ శత్రువులందరినీ ఇలాగే మట్టు పెడతామని కూడా వార్నింగ్ ఇచ్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు