World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి...సెమీస్‌ బెర్త్‌ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది.

New Update
World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్

India Vs Srilanka World Cup 2023: ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి...సెమీస్‌ బెర్త్‌ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది. మరో వైపు ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది.

టీమ్ ఇండియా ఆటగాళ్ళు వరల్డ్ కప్ మొదటి నుంచి విజృంభిస్తున్నారు. ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పెద్ద జట్ల మీద కూడా గెలిచి చూపించింది. అదే హవాను కొనసాగించాలనే ఊపు మీదుంది టీమ్ ఇండియా. టోర్నీ ముందుకు సాగేకొద్దీ టీమ్‌ ఇండియా బలం పెరుగుతోంది. ప్రధాన ఆటగాళ్లందరూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హార్దిక్‌ పాండ్య దూరం కావడంతో జట్టులో ఛాన్స్ చేజిక్కించుకున్న ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం సత్తా చాటారు. ఒక్క శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఇప్పటి వరకు తన ప్రతిభ చూపించలేకపోతున్నాడు. మరోవైపు శుభ్ మన్ గిల్ (Shubman Gill) కూడా తన సూపర్ ఆటను చూపించలేదు ఇప్పటివరకు. కానీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సూపర్‌ ఫామ్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కోహ్లి (Virat Kohli) కూడా చాలా బాగా ఆడుతున్నాడు. రాహుల్‌ కూడా మిడిలార్డర్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడె పిచ్‌పై భారీ స్కోరు చేయడానికి భారత్‌కిది మంచి అవకాశమే. బౌలింగ్‌లో భారత్‌కు పెద్ద సమస్యలేమీ లేవు. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన షమి చెలరేగిపోతుంటే.. బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా నిలకడను కొనసాగిస్తున్నారు. సిరాజ్ కూడా దుమ్ము దులుపుతున్నాడు.

Also Read: ఈ ఫొటోకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది..సచిన్ ఎమోషనల్ పోస్ట్..!

ప్రపంచకప్‌లో శ్రీలంక, బారత్ 9 సార్లు ఎదురెదురుపడగా.. భారత్‌ 4, శ్రీలంక 4 విజయాలతో సమంగా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం​ రాలేదు. ఇక వాంఖడే పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది.  ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసే జట్లు 350కు పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.

తుది జట్లు..

భారత్..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రీయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, బుమ్రా, కులదీప్ యాదవ్, మహ్మద్ షమీ.

శ్రీలంక...
పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Advertisment
Advertisment
తాజా కథనాలు