World Cup 2023:భారత్-న్యూజిలాండ్...ఇవాళ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది?

 ప్రపంచకప్ లో అత్యంత ముఖ్యమైన స్టేజ్ కు వచ్చేశాం. ఈరోజు నుంచే సెమీస్ మొదలవుతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. నేడు వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.

New Update
World Cup 2023:భారత్-న్యూజిలాండ్...ఇవాళ మ్యాచ్ లో ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది?

2023 వరల్డ్‌కప్‌లో మొదటి సెమీ ఫైనల్స్ ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇందులో గెలిచిన వారు ఫైనల్స్ వెళతారు. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు...ఎవరు ఫైనల్స్ కు వెళతారు అనేది ఆసక్తి కరంగా మారింది. న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 117 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 59, న్యూజిలాండ్ 50 గెలుచుకున్నాయి. దీనిబట్టి ప్రస్తుతానికి భారత్ దే పై చేయిగా కనిపిస్తోంది. అయితే దీనిని అంతగా నమ్మడానికి లేదు. ఎందుకంటే అన్ని సార్లూ రెండు జట్లు కూడా విజయాల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు భారత్‌కు సెమీస్ గండండ ఉంది. దానికి తోడు లాస్ట్ వరల్డ్ కప్ లో ఇదే న్యూజిలాండ్ చేతిలో ఇండియా...ఇదే సెమీస్ లో ఓడిపోయిన చరిత్ర కూడా భయపెడుతోంది.

Also Read:ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

ఇక భారత్‌లో ఇప్పటివరకు న్యూజిలాండ్ భారత్‌తో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 8 మాత్రమే గెలిచింది. అంటే మన టీమిండియా 30 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. అలాగే 2000 తర్వాత గణాంకాలను కూడా పరిశీలిస్తే న్యూజిలాండ్ ప్రదర్శన అంతే దారుణంగా ఉంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య మొత్తం 20 మ్యాచ్‌లు భారత్‌లో జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగా, భారత్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ లెక్కలు టీమిండియాకు చాలా అనుకూలంగా ఉన్నాయి.

దీనితోడు ప్రపంచ కప్‌కు ముందు భారత్-న్యూజిలాండ్ తలపడ్డాయి. మూడు మ్యాచ్‌ల ఓడీఐ సీరీస్ జరిగింది. వాటిల్లో కూడా కీవీస్ జట్టు ఓడిపోయింది. అది కూడా మెయిన్ ప్లేయర్స్ కూడా లేకుండఆ ఆడిన భారత్ టీమ్‌తో. అలాగే లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. దీని తర్వాత కీవీస్ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది. లాస్ట్ లో శ్రీలంక మీద గెలిచి సెమీస్ గట్టెక్కింది. అయితే న్యూజిలాండ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే లాస్ట్ రెండు ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్ ఫైనల్స్ వరకూ వెళ్ళింది. ఇది వాళ్ళకు అదనపు బలాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని టీమ్ ఇండియా చాలా బాగా గుర్తు పెట్టుకుని ఆడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు